టాప్ స్టోరీస్

ఆకాశం నుంచి తోటలో పడ్డ శవం!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

లండన్ నగరంలోని క్లాపం ప్రాతంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన ఇంటి పెరడులో సన్ బేతింగ్ చేస్తున్నాడు. అంటే ఎండను ఆస్వాదిస్తున్నాడు. అకస్మాత్తుగా  ఆకాశం నుంచి ఏదో వచ్చి అతనికి మూడడుగుల దూరంలో పక్కనే పడింది. షాక్ నుంచి తేరుకుని చూసేసరికి ఆ పడింది ఒక మనిషి మృతదేహం.

దక్షిణ లండన్‌లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నైరోబీ నుంచి లండన్ వస్తున్న కెన్యా ఎయిర్‌లైన్స్ విమానం నుంచి ఈ మృతదేహం కింద పడింది. అక్రమంగా వలస వెళ్లాలనుకునే వారు కొందరు దొంగచాటుగా విమానం ల్యాండింగ్ చక్రాల కంపార్ట్‌మెంట్‌లో దాక్కుంటారు. అయితే వారిలో బతికిబట్ట కట్టేవారు చాలా కొద్దిమంది. విమానం గగనలతలంలోకి వెళ్లిన తర్వాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో  వళ్లు గడ్డకట్టే చలి ఉంటుంది. పైగా అంత ఎత్తులో ఆక్సిజన్ కూడా అందదు.

Photo Courtesy: Mirror

కెన్యా ఎయిర్‌లైన్స్ విమానం హీత్రో విమానాశ్రయంలో దిగిన తర్వాత ల్యాండింగ్ గేర్ కంపార్ట్‌మెంట్‌లో  పోలీసులు ఒక బ్యాగ్, కాసిని నీరు, కాస్త ఆహారం కనుగొన్నారు. మృతుడు ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కింద పడడానికి ముందే అతడు మరణించి ఉంటాడని భావిస్తున్నారు. తోటలో మృతదేహం కింద పడ్డచోట రాతి పలక పగిలింది. 3000 అడుగుల ఎత్తు నుంచి పడినప్పటికీ మృతదేహం కూడా ఛిద్రం కాలేదు. కారణం అప్పటికే శవం ఐస్ మాదిరి గడ్డ కట్టిపోయిఉంది.

Video Courtesy: Time


Share

Related posts

‘సేవ్ నల్లమల్ల’ ఉద్యమం.. దిగివచ్చిన ప్రభుత్వం!

Mahesh

ఏపీ విలీనం చేస్తే.. తెలంగాణ కూడా చేయాలా?

Mahesh

సుష్మా జవాబు సూపర్

Kamesh

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar