రాజస్థాన్: మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆరోపణపై బాలివుడ్ నటి పాయల్ రోహత్గిని బండీ పోలీసులు అరెస్టు చేశారు. పాయిల్ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పి మమత గుప్తా తెలిపారు.
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తల్లిదండ్రులతో పాటు ఆయన భార్య గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గత నెల 21న పాయిల్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో చర్మేష్ శర్మ అనే కాంగ్రెస్ కార్యకర్త పాయిల్పై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పాయిల్ పలు టివి రియాలిటీ షోల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని బాలివుడ్ చిత్రాల్లో కూడా నటించింది. పదేళ్ల క్రితం బిగ్బాస్ షోలో కూడా పాల్గొంది.
Rajasthan: Model & actress Payal Rohatgi detained by Bundi police, allegedly for her comment on former Prime Minister Pandit Jawaharlal Nehru. SP Mamta Gupta says, "Payal Rohatgi has been detained. Case registered." pic.twitter.com/KkKxXDwpgA
— ANI (@ANI) December 15, 2019