(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చెయ్యటంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. అమరావతిలో సిఎం జగన్, హైదరాబాద్‌లో సిఎం కేసీఆర్ హై లెవల్ అధికారులతో సమీక్షలు ఏర్పాటు చేసుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం తెలంగాణా సి ఎం కెసిఆర్ మంత్రి వర్గ సమావేశం నిర్వహించి పరిస్థితికి అనుగుణంగా చర్యలను వేగవంతం చేశారు.
తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా, ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల జోరు నడుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా శనివారం రాష్ట్రంలో కరోనా ప్రభావంపై సుదీర్ఘంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో కరోనా నియంత్రణకు పక్కా చర్యలను తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కరోనా నియంత్రణకు మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ముందు జాగ్రత్తగా పాఠశాలలతో పాటు, సినిమా హాల్స్, మాల్స్‌ను కూడా మూసివేయాలని సీఎం నిర్ణయించారు. మరో నాలుగు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ముగియనున్న నేపథ్యంలోనే పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహించనున్నారు. పదో తరగతి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరుగనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని వాయిదా వేస్తున్నట్లు రాజభవన్ వర్గాలు ప్రకటించాయి.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలతో బిజీగా వున్న ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నెల్లూరులో గుర్తించడంతో అప్రమత్తమయ్యారు. మరి కొందరికి కరోనా వుందన్న ప్రచారం జోరందుకోవడంతో ఆయన హైలెవెల్ సమీక్ష నిర్వహించారు. ఎయిర్ పోర్టులతో పాటు పెద్ద నగరాలలో, ఆసుపత్రిల్లో తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై సమీక్షించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలు సమూహాలుగా ఉండొద్దని, బయట ఎక్కువగా తిరగరాదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రమాదకర కరోనా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణకు భక్తులు వేచి ఉండే పద్దతికి తాత్కాలికంగా స్వస్తి పలికింది. టైమ్ స్లాట్ ద్వారా మాత్రమే టోకెన్లు కేటాయించి భక్తులను దర్శనానికి పంపాలని టీటీడీ నిర్ణయించింది. కంపార్ట్మెంట్లులో వేచి ఉంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్య ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధితులకు సహకరించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన హెల్ప్ లైన్ నంబర్ల జాబితా ను కేంద్రం విడుదల చేసింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ లో ఈ జాబితా ఉంచారు.
ఢిల్లీ లో ఉన్న వారు సహాయం కోసం 011-23978046 కు డయల్ చేయవచ్చు.
కేంద్రం విడుదల చేసిన ఆయా రాష్ట్రాల హెల్ప్ లైన్లు..
ఆంధ్రప్రదేశ్: 0866-2410978
అరుణాచల్ ప్రదేశ్: 9436055743
అసోం: 6913347770
ఛత్తీస్‌గఢ్ : 07712235091
ఢిల్లీ : 01122307145
హర్యానా: 8558893911
జమ్మూ: 01912520982
కశ్మీర్: 01942440283
కేరళ: 04712552056
లడఖ్: 01982256462
మధ్య ప్రదేశ్ : 0755-2527177
మహారాష్ట్ర: 020-26127394
నాగాలాండ్: 7005539653
ఒడిశా: 9439994859
రాజస్థాన్: 01412225624
తమిళనాడు: 04429510500
త్రిపుర: 03812315879
ఉత్తర ప్రదేశ్: 18001805145
పశ్చిమ బెంగాల్: 3323412600
అండమాన్ & నికోబోరా: 03192232102
బీహార్, గోవా, గుజరాజ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలి, డమాన్ అండ్ డయ్యూ, లక్ష ద్వీప్, పుదుచ్చేరి ప్రజలు 104కు ఫోన్ చేయవచ్చు.
మేఘాలయ హెల్ప్ లైన్ నెంబర్ 108 కాగా, మిజోరం హెల్ప్‌లైన్ నెంబర్ 102.
టాలీవుడ్లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొనసాగుతున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ లకు సేమ్ టు సేమ్ ఒకే పరిస్థితి ఏర్పడింది. పూర్తి…
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…