NewsOrbit
టాప్ స్టోరీస్

మూడు రాజధానులపై బీజేపీకి సమాచారం ఉందా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఏపీకి మూడు రాజధానులంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం కేంద్రంలోని బీజేపీ నేతలకు ముందే సమాచారం ఇచ్చారా ? రాజధాని అంశంపై కేంద్ర పెద్దలతో జగన్ టచ్ లోనే ఉన్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఆగస్టులో టీడీపీ నుండి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఇదే అభిప్రాయాన్ని చేశారు. ఏపీకి నాలుగు రాజధానులు రాబోతున్నాయని, అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ రాజధానులపై ఇప్పటికే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బీజేపీ అధిష్ఠానంతో చర్చించారని చెప్పారు. టీజీ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా సంచలనం అయ్యింది. తాజాగా సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందంటూ లీక్ చేయడం చూస్తే.. కేంద్రంలోని బీజేపీ పెద్దలకి ముందుగానే సమాచారం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఏపీలో భవిష్యత్ ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి జగన్ కేంద్రానికి నివేదించిన మాట వాస్తమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.

జగన్ గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు ప్రధాని మోదీ, అమిత్ షాలతో రాజధాని అంశంపై చర్చించినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన సమయంలోనూ హోం మంత్రి అమిత్ షాతో ఇదే విషయంపై మరోసారి చర్చించాలని భావించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరక్కపోవడం, వ్యక్తిగత కారణాలతో జగన్ తన పర్యటను రద్దు చేసుకుని తిరిగి వచ్చేయడంతో ఈ అంశం తెరపైకి రాలేదని తెలుస్తోంది. రాజధానిపై పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని సీఎం జగన్ నిర్ణయించారు. అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరమని అంటున్నారు. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టొచ్చు, ఇక కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయొచ్చేమో అని జగన్ సూచనప్రాయంగా తెలిపారు.

అయితే, ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఎలా సహకరిస్తుంది ? నిధులు ఇస్తారా లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది. గత బడ్జెట్ లో అమరావతికి కేటాయింపులు చేయలేదు. విభజన కష్టాలతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్‌‌‌ ఎప్పటిలాగానే ఈసారి కూడా కేంద్ర బడ్జెట్‌ వైపు ఆశగా చూసింది. కానీ మోదీ సర్కార్‌.. రాజధాని అమరావతి నిర్మాణం, ఆర్థిక సంఘం నిధులు, ద్రవ్యలోటు నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, కేంద్ర పథకాల నిధుల కేటాయింపులో కాస్త ఎక్కువ మొగ్గు చూపాలని కోరినా కేంద్రం కనికరించలేదు. ఈ నేపథ్యంలో జగన్ తాజాగా చేసిన మూడు రాజధానుల ప్రకటనపై కేంద్రం ఎలాంటి వైఖరి అనుసరిస్తుంది ? వైసీపీ ప్రభుత్వానికి కేంద్ర సహకారం ఉంటుందా ? అన్నది చూడాలి.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment