అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తా!

విజయవాడ : రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే అభ్యర్థలను ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన టెలికాన్ఫిరెన్స్ లో ఆయన పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ పథకాలే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు విభేదాలు, మనస్పర్థలు విడనాడి పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

మూడో ప్రత్యామ్నాయంకు ఆస్కారమే లేదు

దేశంలో మూడవ ప్రత్యామ్నాయంకు ఆస్కారమే లేదన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బిజేపీ కూటమి ఓటమి పాలైందన్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే విజయం సాధించాయన్నారు. పరోక్షంగా బీజెపి లాభం చేకూర్చాలని ఆయన కలలు గంటున్నారని వారి కలలు కల్లలుగానే మిగులుతాయన్నారు. జగన్మోహనరెడ్డికి ఓవైసి ఎప్పుడు స్నేహితుడు అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. వారికి స్వార్థరాజకీయాలే గాని రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని అన్నారు. మేడ్చల్ భహిరంగ సభలో సోనియో గాంధీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే దాన్ని సాకుగా చూపి తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకున్నారని, గతంలో ప్రత్యేక హోదాకు అనుకూలత వ్యక్తం చేసిన కేసీఆర్ నేడు ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్నారనీ ఆయన విమర్శించారు.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఈ నెల 28న రాజమహేంద్రవరంలో జరిగే జయహో బీసి గర్జనను విజయవంతం చేయాలని ఆయన టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.