‘రాజధాని ఏర్పాటు వరకే రాష్ట్రం ఇష్టం’!

Share

అమరావతి : రాజధాని ఎంపిక మాత్రమే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇతర జెఏసి నేతలతో కలసి అమరావతి ప్రాంతంలో రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి ప్రాంతాన్ని శ్మశానం, ఎడారి అంటే చాలా బాధేస్తోందని తెదేపా అన్నారు. అమరావతికి వరదలు వస్తాయనీ, రాజధాని మునిగిపోతుందనీ వైసీపీ నేతలు పదేపదే అవాస్తవాలు ప్రచారం చేశారనీ విమర్శించారు.

23 ఏప్రిల్‌ 2015న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని, ఈ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు.

వైసీపీ ప్రభుత్వం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయనీ, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందనీ చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించారు. డిల్లీలో అమరావతి జె ఏ సి నాయకులు అందరినీ కలుస్తున్నారనీ, విశాఖ ప్రజలు కూడా అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారనీ చంద్రబాబు అన్నారు.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

51 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago