NewsOrbit
Right Side Videos టాప్ స్టోరీస్

పులులను తరిమికొట్టిన ఎలుగు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అడవిలో పులిని చూస్తే ఏ జంతువైనా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. కానీ, ఓ ఎలుగు మాత్రం తనపై దాడి చేసిన పులులకు అస్సలు బెదరలేదు సరికదా కన్నెర్రజేసి వాటినే రివర్స్‌లో బెదిరించింది. ఇదెక్కడి సైకో ఎలుగుబంటిరా నాయనా అనుకుని ఆ పులులు వచ్చినదారినే వెనక్కి పరుగులు పెట్టాయి. ఈ విచిత్ర ఘటన రాజస్థాన్‌లోని రథంబోర్ నేషనల్ పార్కులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ వీడియోలో ఎలుగుబంటిని ఓ పులి చాలా దూరం వరకు వెంబడించింది. మధ్యలో మరో పులి ఎదురైంది. రెండు పులులు ఎలుగు బంటిని తినేద్దామనుకున్నాయి. ముందుగా ఒకటి ఎలుగుబంటి దగ్గరకు వచ్చింది. దానిమీదకు దాడి చేయాలని ప్రయత్నించింది. అయితే, ఎలుగు ఏమాత్రం భయపడలేదు. ధైర్యంగా రొమ్ము విడిచి దాని ముందు రెండుకాళ్ల మీద నిలబడింది. దీంతో ఆ రెండు పులులు ప్రాణభయంతో పరారయ్యాయి. అనంతరం ఎలుగు సైతం వెనక్కితిరిగి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఇది పాత వీడియోనే అయినప్పటికీ రాజ్యసభ ఎంపీ పరిమల్ నత్వానీ దీన్ని ట్విట్టర్‌లో షేర్ చెయ్యడంతో మళ్లీ వైరల్ అయ్యింది. ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది వీక్షించారు. చాలా మంది దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. ‘భలే ఉంది ఎలుగు ఖలేజా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ పులులు… పెద్దవి కాకపోవచ్చనీ, అందువల్లే అవి ఎలుగు బంటిని చూసి భయపడ్డాయని మరికొందరు కామెంట్లు చేశారు.

https://twitter.com/Pushpar00274777/status/1219598435399032832

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Leave a Comment