NewsOrbit
టాప్ స్టోరీస్ బిగ్ స్టోరీ

నీలం సాహ్నికి జగన్ వరం…!

ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి సీఎం జగన్ కి పడడం లేదు అని ప్రచారం జరిగింది. ఆమె అసంతృప్తిగా ఉన్నారని, రాజీనామా చేసేస్తారని అనుకున్నారు. కానీ ఆమె విషయంలో ఓ అనూహ్యమైన వార్త బయటకు వచ్చింది. ఆమె పూర్తి కాలం పదవిలో కొనసాగడమే కాదు, అదనంగా మరి కొన్ని నెలలు కూడా ఆమె అదే పదవిలో ఉండేలా సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారట. అదే జరిగితే, జగన్ ప్రయత్నాలు ఫలిస్తే నీలం కి జగన్ వరం ఇచ్చినట్టే. చాల కాలంగా ఏ సిఎస్ కు దక్కని గౌరవం ఆమెకి దక్కినట్టే.

జూన్ తో ముగియనున్న సాహ్ని పదవి కాలం…!

నీలం సాహ్ని సమర్థవంతమైన ఐఏఎస్ గా పేరు తెచ్చుకున్నారు. ఏపీ సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే తనదైన పనితీరుతో మంచి పేరు సంపాదించుకున్నారు. రాజధాని ప్రక్రియ, సీఎం జగన్ కి ప్రత్యేకమైన బిల్లులు, ఆర్డినెన్సులు విషయంలో ఆయనకు అనుగుణంగా పని చేశారు. కరోనా విపత్తు సమయంలో సాహ్ని కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో పరిస్థితులను ముఖ్యమంత్రితో ఎప్పటికపుడు సమీక్షిస్తూ….అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులు చక్కదిద్దుతున్నారు. మరోవైపు జూన్ 30తో నీలం సాహ్ని పదవీకాలం ముగియనుంది. అందుకే ఆమె పని తీరుపై సంతృప్తిగా ఉన్న జగన్ ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. ఆమోదం వస్తే సెప్టెంబర్ వరకు ఆమె కొనసాగనున్నారు.

ఆశావహుల ఎదురుచూపులు…!

నీలం సాహ్ని తదనంతరం సీఎస్ పదవి చేపట్టేందుకు పలువురు అధికారులు పోటీ పడుతున్నారు. సీనియర్ ఐఏఎస్ సతీష్ చంద్ర ఆ రేసులో ముందుండగా…నీరబ్ కుమార్ , ఆదిత్యనాథ్ దాస్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ ముగ్గురిలో జగన్ కేసుల్లో గతంలో విచారణ ఎదుర్కొన్న ఆదిత్యనాథ్ దాస్ కి సీఎస్ పదవి దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. అయితే వీరి ఆశలకు సీఎం జగన్ తాత్కాలికంగా బ్రేకులు వేశారు. నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో 3 నెలల పాటు పొడిగించాలని జగన్ భావించి, ఆమె కొనసాగింపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. సీఎం జగన్ లేఖతో సీఎస్ రేసులో ఉన్న ఆశావహులకు కొంతకాలం నిరాశ తప్పేలా లేదు. మరి సీఎం జగన్ లేఖకు స్పందించి సాహ్నిని సీఎస్ గా కొనసాగించేందుకు మోడీ అనుమతిస్తారా లేదా అన్నది చూడాలి

ఆమె ఎందుకంటే…!

నీలం సాహ్ని కంటే సమర్థులైన అధికారులు ప్రధాన కార్యదర్శి రేసులో ముందున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఆమె ఉంటె బాగుంటుందని భావించడానికి అనేక కారణాలున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా రాజధాని సచివాలయం తరలింపు ప్రక్రియ మూడు, నాలుగు నెలల్లో ఓ కొలిక్కి వస్తుందని ఆయన భావిస్తున్నారు. జగన్ఇ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ళ్ల స్థలాల పట్టాలు పంపిణి జులై 8 న జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నాటికి ఓ దశకు రానున్నాయి. ఇలా కీలకమైన అంశాలు ముందు ఉండడంతో ఈ సమయంలో ప్రధాన కార్యదర్శి మార్పు మంచిది కాదని జగన్ భావిస్తున్నట్టు సమాచారం.

author avatar
Srinivas Manem

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

Leave a Comment