పంచాయతీరాజ్ అవగాహన సదస్సు 27న

తెలంగాణ సీఎం కేసీఆర్ పంచాయతీ ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయారు. పంచాయతీ రాజ్ అవగాహన సదస్సు నిర్వహించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. ఎంపీడీవోలు, ఈపీడీవోలు, డీఎల్పీలతో ఈ నెల 27న పంచాయతీరాజ్ అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఈ సదస్సు జరుగుతుంది.

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో గ్రామాల అభివృద్ధి,  పంచాయతీరాజ్ సిబ్బంది పనితీరు తదితర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల 50%గా నిర్ణయిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా స్థానిక ఎన్నికలపై దృష్టి సారించనట్లు స్పష్టమైన సంకేతాలిచ్చిన సీఎం ఇక బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్ల వ్యవహారంపై దృష్టి కేంద్రీకరించారు. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో బీసీల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా సర్కార్ ఆర్డినెన్స జారీ చేసింది. ఆ వెంటనే గవర్నర్ ఆమోదం సైతం పొందింది.