(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారతదేశంలో డెంగ్యూ జ్వరాలతో ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లలు ఈ వ్యాధికి ఎక్కువగా గురవుతున్నారు. సీజన్ దాటినా ఇప్పటికీ డెంగ్యూ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది. డెంగ్యూ కారణంగా ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే ఈ జ్వరం బారిన పడి వందలాది మంది రోగులు హాస్పిటల్స్‌లో మృత్యువాత పడుతున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ వెక్టర్ బర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (ఎన్వీబీడీసీపీ) లెక్కల ప్రకారం అక్టోబర్ 13 వరకు భారతదేశంలో మొత్తం 67,377 డెంగ్యూ కేసులు నమోదు కాగా.. 48 మంది మృతి చెందారు.
జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో సోషల్ మీడియాలో ఎన్నో అర్థం లేని ఆరోగ్య చిట్కాలు దర్శనిమిస్తున్నాయి. తాజాగా డెంగ్యూ జ్వరాన్ని కలగజేసే దోమ కాటు నుంచి తప్పించుకోగలిగే కొబ్బరినూనె మహత్యం గురించి ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది.
Prevention is better than cure ♥️ pic.twitter.com/q6q0JvKokW
— thaman S (@MusicThaman) October 11, 2017
ఆ పోస్ట్ సారాంశం ఏంటంటే…. ‘కొబ్బరి నూనెకు యాంటీబయాటిక్ గుణాలు ఉంటాయి. కాబట్టి పాదాల నుంచి మోకాళ్ల వరకూ కొబ్బరినూనె పూసుకుంటే, మెకాలి ఎత్తుకు మించి డెంగ్యూ దోమలు ఎగరలేవు కనుక కుట్టే అవకాశమే ఉండదు.’
అయితే, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ చిట్కా గురించి నిపుణులు భిన్నంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి నిరుపయోగమైన పోస్ట్‌లను పట్టించుకోవద్దనీ, కొబ్బరినూనెకు ఎలాంటి యాంటీబయాటిక్ గుణాలూ ఉండవనీ, డెంగ్యు రాకుండా ఉండాలంటే ఆ దోమలు దరి చేరకుండా చూసుకోవడం ఒక్కటే మార్గమనీ చెబుతున్నారు.
Khabron Ka punchnama: Coconut oil prevents dengue fever: https://t.co/gcmY8Y1vvk via @YouTube
— News Nation (@NewsNationTV) August 2, 2017
ఆల్ట్ న్యూస్ సౌజన్యంతో