ఢిల్లీ, ఏప్రిల్ 19: రాజకీయ నాయకులకు వివిధ సందర్భాలలో ఊహించని ేచేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. నిన్న, నేడు జరిగిన సంఘటనలు అందుకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. నిన్న ఢిల్లీలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్శింహరావు పత్రికా విలేఖరుల సమావేశం నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి చెప్పు విసిరాడు. నిన్న బిజెపి నాయకుడికి ఈ విధంగా పరాభవం జరగ్గా నేడు పటీదార్ ఉద్యమ నేత, కాంగ్రెస్ నాయకుడు హర్ధిక్ పటేల్‌కు అలాంటి చేదు అనుభవం ఏదురయింది,
గుజరాత్‌లోని సురేందర్‌నగర్‌లో జన ఆక్రోష్ పేరిట ఏర్పాటు చేసిన ప్రచార సభలో కాంగ్రెస్ నాయకుడు హార్దిక్ పటేల్ ప్రసంగిస్తుండగా.. వేదికపై దూసుకువచ్చిన ఒక గుర్తు తెలియని వ్యక్తి అతని చెంప ఛెళ్లు మనిపించాడు. దీంతో ఒక్క సారిగా సభా స్థలిలో గందరగోళం చోటుచేసుకుంది. అనంతరం హార్దిక్ పటేల్‌పై దాడి చేసిన వ్యక్తిని చుట్టుముట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు చితకబాదారు. సభలో అతను ఆ విధంగా ఎందుకు చేశాడు, అతను ఎవరు అనే వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై హర్ధిక్ పటేల్ సురేందర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందజేశారు.
ఎఎన్ఐ సౌజన్యంతో… వీడియో కొరకు కింద క్లిక్ చేయండి
#WATCH Congress leader Hardik Patel slapped during a rally in Surendranagar,Gujarat pic.twitter.com/VqhJVJ7Xc4
— ANI (@ANI) April 19, 2019