అగస్టా కుంభకోణం పాత్రలో కాంగ్రెస్ : కన్నా

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో పాత్రధారులంతా కాంగ్రెస్ పెద్దలేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించిన మంత్రి కన్నా మీడియాతో మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని హేళన చేసిన ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అదే తల్లి కాంగ్రెస్‌తో సిగ్గులేకుండా ఎట్లా కలిసారని ప్రశ్నించారు. రాష్ర్టంలో నిధులను దోచేసున్న గజదొంగ గా చంద్రబాబును అభివర్ణించారు. దేశంలోని సంపదను మరికొందరితో కలిసి దోచుకోవడానికి దొంగలను ఏకం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుత తరుణంలో దేశానికి ప్రధాని నరేంద్రమోదీ అవసరం ఎంతైనా వుందన్నారు. తెలంగాణా సీఎం కేసిఆర్‌ను రెచ్చగొట్టింది ముందు చంద్రబాబేనని, ప్రస్తుతం బాబు మానసిక పరిస్థితి సరిగ్గా లేదని కన్నా వ్యాఖ్యానించారు.