NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

పాపం..! ఎంపీకే కరోనా తికమక..!!

 

కరోనా రిపోర్టులలో గందరగోళం సామాన్యులకే కాదు ప్రజా ప్రతినిధులకు ఎదురవుతోంది. చాలా ప్రాంతాల్లోకరోనా రిపోర్టులు తప్పుల తడకగా ఉంటున్నాయనీ, ఒకే వ్యక్తికి రెండు చూట్ల పరీక్షలు చేయించుకుంటే ఒక చూట పాజిటివ్, మరొక చూట నెగిటివ్ రిపోర్టులు వస్తున్నాయనీ గతంలోనూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సమస్య ఏకంగా ఒక పార్లమెంట్ సభ్యుడికే వచ్చింది. ఇప్పుడు ఆ ఎంపి రెండు రిపోర్టుల్లో ఏది నమ్మాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రినే ప్రశ్నిస్తున్నారు. ఇంతకూ ఆ ఎంపి ఎవరు, ఆయన సమస్య ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

HANUMAN BENIWAL

రెండు ఐసీఎంఆర్ పరీక్షలే…ఎందుకో ఈ తేడా

పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభల సభ్యులకు పార్లమెంట్ ప్రాంగణంలో నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో 25 మందికి కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనాపాజిటివ్ అని తేలడంతో ఆయా పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు సమావేశాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పార్లమెంట్ హాలు వద్ద నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ రిపోర్టు వచ్చిన రాజస్థాన్ ఎంపి హనుమాన్ బెనీవాల్ తనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకపోవడంతో అనుమానం వచ్చి జైపూర్‌లో మరో సారి కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆయన కరోనా బారిన పడలేదని నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో ఆయన ఈ రెండు రిపోర్టులను తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వీటిలో ఏ రిపోర్టు ఖచ్చితమైనదని అనుకోవాలని ప్రశ్నించారు. రెండు సార్లు చేసింది ఐసీఎంఆర్ పరీక్షలే..కానీ రిపోర్టులు ఒకటి పాజిటివ్‌గా, మరొకటి నెగిటివ్‌గా రావడం ఆ ఎంపి విస్మయానికి కారణం అయ్యింది.  ఈ రిపోర్టులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు ఎంపి హనుమాన్ బెనీవాల్. ఈ ఎంపి సందేహాన్ని ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ నివృత్తి చేస్తారో లేదో చూద్దాం.

కరోనా రిపోర్టుల్లో స్పష్టత లేక ఇబ్బందులు

కరోనా రిపోర్టులలో స్పష్టత లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవంగా కరోనా బారిన పడని వారికి పాజిటివ్ రిపోర్టు వస్తే వారు ఎంత నరక యాతన అనుభవించాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి. కరోనాబాధిత కుటుంబాలను ఎక్కడో ఒకటి రెండు చూట్ల చుట్టుపక్కల వారు మానవతా దృక్పదంతో సహాయ సహకారాలు అందిస్తుండగా, పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా వెలివేసినట్లుగా చేస్తున్నారు. అద్దెకు ఉన్న వాళ్లకు కరోనా వచ్చినట్లు కొద్దిగా అనుమానం వచ్చినా వెంటనే ఇంటి యజమానులు ఇంట్లో ఉండవద్దు, ఆసుపత్రులకు వెళ్లండి అంటూ తరమివేస్తున్న సంఘటనలు అక్కడక్కడా కనబడుతూనే ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!