‘కుంభ్’ కు కోట్లు కేటాయింపు తగదు

బహరాచ్(ఉత్తరప్రదేశ్), జనవరి 1 :   ‘దళితులు’, ‘గిరిజనులు’ తమ హక్కుల కోసం, ఉపాధి అవకాశాలకోసం పోరాడుతుంటే ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం కుంభమేళా, గుళ్ళకోసం కోట్ల రూపాయలను వ్యయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని భారతీయ జనతాపార్టీ మాజీ ఎంపీ సావిత్రీ భాయి ఫూలే విమర్శించారు. యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్ రాష్ర్టాన్ని పాలించడానికి ఏమాత్రం సరిపోడని ఆరోపించారు. మేళాలు, దేవాలయాల వల్ల దేశం అభివృధ్ధి చెందదని చెప్పారు.

మేళాలు, ఆలయాలు దళిత, గిరిజన, ముస్లీం మైనార్టీ ప్రజలను ఆదుకుంటాయా అని ఆమె ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం ‘కుంభ్’ కు కోట్ల నిధులను వెచ్చిస్తోందన్నారు.
రాష్ర్టంలో శాంతి,భద్రతలు పూర్తిగా క్షీణించాయనీ ఆమె ఆరోపించారు. గత ఏడాది డిసెంబరు 6న ఫూలే సమాజంలో విభేధాలు సృష్టిస్తున్నారనీ, రిజర్వేషన్ల సమస్యపైన స్పందించడంలేదనీ నిరసన వ్యక్తం చేస్తూ బిజెపికి రాజీనామా చేశారు.
బహరాచ్ లోక్‌సభ రిజ్వర్వ్ నియోజకవర్గంనుంచి ఫూలే 2014లో తొలిసారిగా పార్లమెంట్ సభ్యలుగా ఫూలే గెలుపొందారు.

SHARE