రఫేల్‌కు పూజ చేస్తే తప్పేమిటంట!?

న్యూఢిల్లీ: దేశానికి రఫెల్ యుద్ధ విమానాలు వస్తున్న విషయాన్ని కాంగ్రెస్ వారు స్వాగతించకుండా విమర్శలు చేస్తున్నారని కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అన్నారు. హర్యానాలోని కర్నాల్‌లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రఫెల్ యుద్ధ విమానంపై తాను ఓం అని రాశాననీ, దానికి రక్షా బంధన్ కట్టాననీ తెలిపారు. రఫెల్ యుద్ధ విమానంపై రాజ్‌నాధ్ ఓం కారం రాయడంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు సంధించారు. ఈ విమర్శలపై రాజ్‌నాధ్ స్పందిస్తూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలు పాకిస్థాన్‌కు బలాన్ని చేకూర్చేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రఫెల్ విమానాలు మనతో ఉంటే బాలకోట్ వాయుదాడులకు వెళ్లాల్సిన పనే ఉండేది కాదనీ, ఇండియాలో కూర్చునే అక్కడి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయవచ్చని రాజ్‌నాధ్ అన్నారు.