పైరసీ ఆయుధంగా తమిళ సినిమా పరిశ్రమను ముప్పు తిప్పలు పెడుతున్న తమిళ్ రాకర్స్ కు చివరికి ముకుతాడు పడింది. పరిశ్రమను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమసల్లో పైరసీ ఒకటి. ముఖ్యంగా తమిళ చిత్ర సీమకు తమిళ్ రాకర్స్ ఓ కొరకరాని కొయ్యలా మారింది. సినిమా విడుదలైన రోజే పైరసీ ద్వారా తమిళ్ రాకర్స్, వాటి అనుబంధ వెబ్సైట్లలో వచ్చేస్తున్నది. దీనిపై ఎన్ని చర్యలు తీసుకున్నా అవి తాత్కాలికంగానే ఉంటూ వచ్చాయి. అయితే ఈసారి వార్నర్ బ్రదర్స్, స్టార్, నెట్‌ఫ్లిక్స్ వంటి అంతర్జాతీయ సంస్థలు రంగంలోకి దిగాయి. తమ కంటెంట్‌ను తమిళ్ రాకర్స్ అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్నదని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, తమిళ్ రాకర్స్ సహా దాని అనుబంధ వెబ్ సైట్లను బ్లాక్ చేయాలని టెలికాం కమ్యూనికేషన్స్ శాఖకు ఆదేశాలను జారీ చేసింది.
previous post
next post