(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సోషల్ మీడియా సెన్సేషన్ రాణు మండాల్ పాడిన ‘తేరీ మేరీ కహానీ’ సాంగ్ ఎంతలా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పాటతో ఒక్కసారిగా ఆమె జీవితమే మారిపోయింది. రైల్వేస్టేషన్ నుంచి ఆమె ఒక్కసారిగా సెలబ్రిటీ స్థాయికి ఎదిగిపోయింది. తాజాగా ఆ పాటను ఓ వ్యక్తి హార్మోనియం వాయిస్తూ ఆలపించాడు. అయితే, అతనితోపాటు ఓ కుక్క కూడా అతనితో గొంతు కలిపింది. మొరుగుతూ, అరుస్తూ కుక్క భౌమంటూ పాట అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.facebook.com/subir.khan.35/videos/1800295480106288/
30 సెకెన్ల పాటు ఉన్న ఈ వీడియోని సుబీర్ ఖాన్ అనే వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. కుక్క పాటపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఆ కుక్క పాడటానికి ప్రయత్నిస్తుందో.. లేక పాట భరించలేక ఆపేయమని అర్థిస్తుందో తెలిసి చావట్లేదని ఓ నెటిజన్ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ‘అతని పాటను శునకం భరించలేకపోతుంది. అందుకే అతను పాడకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది’, ‘ఇద్దరూ ఒకేలా పాడుతున్నారు’, ‘కుక్క పాట పాడితే ఇలా ఉంటుంది’ అంటూ నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.
The only difference I noticed is, one of the those two singers don't have lyrics.
Except lyrics everything else is same. So both singers deserves harmonium.— Common Man (@co_mmonman) January 15, 2020
https://twitter.com/aparnaAD2/status/1217333137035759616
Just laughing & laughing.
— wuntakal laxman (@WuntakalL) January 15, 2020
That human singer is very biased. He could have given small portion of harmonium to dog as well. #Kaliyug
— Common Man (@co_mmonman) January 15, 2020
That dog after few days pic.twitter.com/fa31CWuZ5E
— Ashwin Yadav (@Ashwinky7) January 15, 2020