(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ బాగ్దాదీని సొరంగంలో వేటాడిన జాగిలాన్ని సత్కరిస్తున్నట్లు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోషాప్ ద్వారా మార్చిన ఫేక్ ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆ జాగిలం మెడలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడల్ ఆఫ్ ఆనర్ వేస్తున్నట్లున్న పొటోను ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ఆ ఫొటో నిజమైనది కాదు. వియత్నాం యుధ్ధంలో 10 మంది ప్రాణాలు కాపాడిన ఆర్మీ మెడిక్ జేమ్స్ మెక్ క్లౌగన్ని 2017లో ట్రంప్ మెడల్‌తో సత్కరిస్తున్న ఫొటోను ఫొటోషాప్ ద్వారా ఎడిట్ చేసి అందులో జాగిలాన్ని చొప్పించారు. మితవాద వెబ్సైట్ డైలీవైర్ ఈ ఫొటోను విడుదల చేసింది. జాగిలాన్ని అమెరికన్ హీరో అంటూ ట్రంప్ అదే ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే, దీనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. జేమ్స్ ఫోటోని ట్రంప్ ఎందుకు మార్చారు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
https://twitter.com/realDonaldTrump/status/1189601417469841409
అమెరికా భద్రతా దళాలు జరిపిన దాడుల్లో ఐసిస్ ఉగ్రసంస్థ అధినేత అబూ బకర్ హతమైన విషయం తెలిసిందే. భయానకమైన టెరరిస్టు కార్యకలాపాలతో కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఐఎస్ఐఎస్ నేత అబూ బకర్ ఆల్ బాగ్దాదీ మరణించాడని అక్టోబర్ 27న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో ప్రకటించారు. ఆమెరికా సైన్యానికి చెందిన ఓ జాగిలం కూడా అతడి వెంటాడి.. వేటాడింది. దీంతో చేసేది లేక తన ముగ్గురు పిల్లలతో ఓ టన్నెల్ లోకి పారిపోయిన బాగ్దాదీ.. బిక్కచచ్చిపోయాడు. అటు సైనికులు, ఇటు సింహంలా దూసుకొస్తున్న ఈ జాగిలాన్ని చూసి భయపడిపోయిన బాగ్దాదీ.. తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో తమ దేశ కమెండోలకు ఎంతగానో సాయపడిన జాగిలం తాలూకు చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. గత మంగళవారం(అక్టోబర్ 29) ట్రంప్ ఈ శునకం ఫోటోని ట్వీట్ చేయగానే అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. అయితే ఇంత జరిగినా ఈ శునకం పేరును ట్రంప్ గానీ, పెంటగన్ గానీ బహిర్గతం చేయకపోవడం గమనార్హం.
Did the president of a country really just tweeted a photo of him giving a medal to a photoshopped dog? https://t.co/Uxn5EuILFW
— capik (@PikSuki) October 31, 2019
— Born Miserable (@bornmiserable) October 30, 2019
Hmm, I don't want to sound like some wing nut conspiracy theorist or anything but there's something not quite right here… https://t.co/93mqlKBy8q
— Newfield Chris (@newfieldchris) October 31, 2019
I hate that this had to be 'confirmed' to be photoshopped. https://t.co/qg1Dxw1vaC
— The Most Expensive Shit Coffee Blend. (@EvilPhilmon) October 31, 2019
Haters will say it's a photoshop ???
And it is actually ???? https://t.co/XnWFZSQJeC— Iradukunda Nancy (@NancyIradukunda) October 31, 2019