టాప్ స్టోరీస్

వలసపై వ్యాఖ్యకు గుడ్డుతో దాడి..!

Share

మెల్ బోర్న్:  ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరం. సెనేటర్ ఫ్రేజర్ యానింగ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన పక్కనే ఓ యువకుడు ఉన్నాడు. టీషర్టు వేసుకుని, సెనేటర్ దగ్గరగా నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతుంటే ఫొటో తీయడానికి అన్నట్లు ఎడమచేత్తో ఫోన్ పైకి లేపాడు. తర్వాత నెమ్మదిగా కుడిచేతిని లేపి, తనవద్ద ఉన్న కోడిగుడ్డు తీసి యానింగ్ బట్టనెత్తి మీద వేసి కొట్టాడు. అంతే.. గుడ్డు పగిలింది, తలపైన, యానింగ్ దుస్తుల మీద సొన పడింది. ‘‘ఈరోజు ముస్లింలు బాధితులు కావచ్చు; కానీ సాధారణంగా వాళ్లు ఘోరమైన తప్పులు చేసేవారు’’ అని సెనేటర్ యానింగ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం నాటి మసీదు కాల్పులలో 49 మంది మరణించడంపై ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యూజిలాండ్ వీధుల్లో రక్త ప్రవాహానికి అసలు కారణం వేరే ఉంది. ఇక్కడి ఇమ్మిగ్రేషన్ విధానం కారణంగా ముస్లిం మతమౌఢ్యులను న్యూజిలాండ్ కు వలస రానిచ్చారు’’ అని ఆయన ఓ ప్రకటనలో చెప్పారు.

అలా అన్న ఒక రోజు తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా ఆయన తల వెనకవైపు ఓ యువకుడు కోడిగుడ్డుతో కొట్టాడు. వెంటనే ఫ్రేజర్ యానింగ్ వెనక్కి తిరిగి, ఆ యువకుడి ముఖం మీద చెతితో బలంగా కొట్టారు.  మరోసారి తిరిగి కొట్టే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. యువకుడిని కింద పడేసి చేతులు వెనక్కి కట్టేశారు. ఈ సంఘటనకు సంబంధించిన 7 సెకన్ల వీడియో ఒకటి బయటకు రాగా, కేవలం కొద్ది గంటల్లోనే దాన్ని 20 లక్షల మంది చూశారు.

సెనేటర్ మీద దాడిచేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసినా, కొద్దిసేపటి తర్వాత ఎలాంటి కేసు లేకుండా విడుదల చేశారు. యానింగ్ వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కూడా ఖండించారు. ఇలాంటి వ్యక్తులకు పార్లమెంటు కాదు కదా.. ఆస్ట్రేలియాలోనే చోటులేదన్నారు.

వీడియో కోసం కింద క్లిక్ చేయండి.


Share

Related posts

హజీపూర్ హత్యల కేసుపై 27న తుది తీర్పు!

Mahesh

చర్చి పునర్నిర్మాణానికి 786 కోట్ల విరాళం

Kamesh

మూడు రాజధానులు సాధ్యమేనా?

Mahesh

Leave a Comment