టాప్ స్టోరీస్

ఆ డబ్బు వెనుక అసలు కథ!

Share

భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ దాడులు జరిగి రెండు రోజులయ్యిందోలేదో.. అప్పుడే ఫేక్ వీడియోల సందడి మొదలైపోయింది. ‘ఆల్ట్ న్యూస్’ ఈ విషయంపై పరిశోధించి అసలు గుట్టు బయటపెట్టింది. ‘‘మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కేబినెట్ లోని ఓ మంత్రి ఇంట్లో పట్టుకున్న నోట్ల కట్టలు.. పట్టుకున్న తర్వాత వీటిని కాల్చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. భారతదేశం బాగా ధనికమైనదే గానీ ప్రజలు మాత్రం పేదవాళ్లు’’ అని దానికి కేప్షన్ పెట్టారు. సగం కాలిపోయిన నోట్ల కట్టలు ఉన్న వీడియో అందులో ఉంది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫాలో అయ్యే చౌకీదార్ రోహిణి (@RohiniShah73) ట్వీట్ చేశారు. దాన్ని దాదాపు 30 వేల మంది వరకు చూశారు.

ఇదే వీడియో ఫేస్ బుక్ ద్వారా కూడా వైరల్ అయ్యింది. ఇదంతా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కార్యదర్శి నుంచి స్వాధీనం చేసుకున్న డబ్బని అందులో చెప్పారు. కనక్ మిశ్రా అనే వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియోకు దాదాపు 63వేల వ్యూస్ వచ్చాయి.

https://www.facebook.com/100027021983484/videos/275653000012097/

డబ్బు కాదు.. కళా ప్రదర్శన
ఎవరైనా కాస్త జాగ్రత్తగా వీడియోను పరిశీలిస్తే, అందులో ఉన్నవి భారతీయ కరెన్సీ నోట్లు కావు, యూరోలని తెలిసిపోతుంది. ఇదే వీడియో ఇంతకుముందు తమిళనాడు ఎమ్మెల్యే ఎస్పీ వేలుమణి, కర్ణాటక కాంగ్రెస్ మంత్రి డీకే శివకుమార్, బీజేపీ ఎంపీ రాజీవ చంద్రశేఖర్ ల పేరుతోనూ ప్రచారం అయినప్పుడు ఆల్ట్ న్యూస్ ఆ విషయాన్నీ బయటపెట్టింది. నిజాకి ఇది 2018లో స్పెయిన్ దేశంలో నిర్వహించిన ఓ కళా ప్రదర్శన. వీటిని అలెజాండ్రో మాంగే అనే స్పానిష్ కళాకారుడు చేత్తో పెయింట్ చేశారు. ఆయన అదే వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంటులో పోస్ట్ చేశారు. ఆదాయపన్ను అధికారులు కమల్ నాథ్ సంబంధీకుల ఇళ్లపై దాడి చేసిన మాట వరకు వాస్తవమే గానీ, ఈ వీడియోకు.. ఆ కథనానికి మాత్రం ఏమీ సంబంధం లేదు.


Share

Related posts

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం!

Mahesh

‘అమరావతి అడ్రసే టెంపరరీ!’

somaraju sharma

ఆ మందు ఖరీదు.. 14.57 కోట్లు

Kamesh

Leave a Comment