టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రూటు మారుతున్నారా..? అడుగులు ఎటువైపు..?

Share

ఏపిలో పలువురు టీడీపీ ప్రముఖుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారు అయ్యింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికితీసి అందుకు భాద్యులైన వారిని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాలని సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే టీడీపీ కి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇఎస్ఐ స్కామ్ లో, నకిలీ వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, హత్య కేసులో కుట్ర దారుడిగా మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్రలను అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితిలో కొందరు టీడీపీ ప్రముఖులు వైకాపాకు దగ్గర అవుతుండగా, మరికొందరు సైలెంట్ గా ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లో భూమా నాగిరెడ్డి, శోభా దంపతుల రాజకీయ వారసురాలిగా వచ్చి అనూహ్యంగా టీడీపీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించిన భూమా అఖిల ప్రియ నేడు సేఫ్ జోన్ వెతుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

2014 లో ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో వైకాపా తరపున ఏకగ్రీవంగా ఎన్నికైన అఖిల ప్రియ.. అనంతరం టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. 2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి చేతిలో పరాజయం పాలైయ్యారు. అనంతరం భూమా నాగిరెడ్డికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆమెకు దూరం కావడం తదితర పరిణామాల నేపథ్యంలో భూమా ఫ్యామిలీ హవా తగ్గింది. దీనికి తోడు ఇటీవల అఖిల ప్రియ తన హత్యకు కుట్ర చేసిందంటూ ఏవి సుబ్బారెడ్డి ఆరోపించడం తీవ్ర సంచలనం అయ్యింది.

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అఖిల ప్రియ రాజకీయాలు కొనసాగిస్తూనే సినీ నిర్మాణ రంగం వైపుకు వెళ్లాలన్న ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తన భర్త భార్గవ నాయుడుతో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని అనుకుంటున్నారుట. ఎలాగూ భూమా ఫ్యామిలీకి సినీ పరిశ్రమ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నందున అటువైపు అడుగులు పడుతున్నాయని అంటున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల తరువాతే ఈ నిర్ణయానికి వచ్చినా.. ఆ ప్రయత్నాలు మొదలు పెట్టే లోపు కరోనా సమస్య ఎదురు కావడంతో కార్యరూపం దాల్చలేదుట.

సాధారణంగా సినీ రంగం నుండి రాజకీయాలకు వస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. రాజకీయాల నుండి అఖిల ప్రియ సినీ పరిశ్రమకు వెళుతున్నారు. రాజకీయంగా పెద్దగా రాణించలేకపోయిన అఖిల ప్రియ సినీ రంగంలో సక్సెస్ సాధిస్తారేమో వేచి చూడాలి.


Share

Related posts

ట్రంప్ దెబ్బ -మోడీ ప్లానింగ్ కు దిగొచ్చిన చైనా!కీలక ప్రకటన

Yandamuri

Kishan reddy: కిష‌న్ రెడ్డికి ఇంకో గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని

sridhar

నేడే విడుదల

Kamesh