NewsOrbit
టాప్ స్టోరీస్

వివాదాలను ఆహ్వానించిన నేత

 

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ఆత్మహత్యతో తనువు చాలించిన టిడిపి నేత కోడెల శివప్రసాదరావు వివాదాలను ఆహ్వానించిన రాజకీయ నాయకుడు. ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దానితో పాటు రాజకీయ జీవితం ప్రారంభించిన కోడెల విద్యాధికుడు. ఆయన ఎంబిబిఎస్ తర్వాత ఎంఎస్ (జనరల్ సర్జరీ) చదివి నర్సరావుపేటలో వైద్య వృత్తి చేశారు. డాక్టర్‌గా చాలా మంచి పేరు సంపాదించారు. ఎడా పేడా ఆపరేషన్‌లు చేసి తన హస్తవాసి చాలా మంచిదన్న గుర్తింపు పొందారు. వైద్యుడిగా ఇంత పేరు సంపాదించిన వ్యక్తి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత దూకుడు తనం ప్రదర్శించారు. నర్సరావుపేట ప్రాంతంలో కాసు కుటుంబాన్ని ఢీకొని అభిమానులతో పల్నాటి పులి అని పిలిపించుకున్నారు.

ప్రతికూల పరిస్థితులు ఎదురయినప్పుడు వెరచి వెనుకంజ వేయడం కోడెలకు ఎప్పుడూ అలవాటు లేదు. గుంటూరు జిల్లా టిడిపి రాజకీయాలను ఆయన కొంత కాలం శాసించారు. అయితే ఆయన పద్ధతులు పార్టీలోనే చిన్న పాటి వ్యతిరేక వర్గాన్ని సంపాదించి పెట్టాయి. పార్టీలో తనను  వ్యతిరేకించిన వారిని వేధించేందుకు కూడా ఆయన వెనుకాడలేదు.

ఎన్‌టి రామారావు మంత్రివర్గంలో కోడెల హోంశాఖ నిర్వహిస్తున్న సమయంలో విజయవాడ నగరంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు, కాపు సామాజికవర్గం నేత వంగవీటి మోహనరంగా హత్యకు గురయ్యారు. ప్రతీకారంగా అల్లరిమూకలు తీవ్ర విధ్వంసానికి, దాడులకు పాల్పడ్డాయి. రంగా హత్యకు హోంమంత్రిదే బాధ్యత అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ సంఘటనలకు హోంమంత్రిగా బాధ్యత వహిస్తూ కోడెల శివప్రసాదరావు రాజీనామా చేశారు.

కోడెల మంత్రిగా ఉండగానే ఒక సారి నర్సరావుపేటలోని ఆయన ఇంట్లో బాంబులు పేలాయి. ఆ సంఘటనలో కొడెల సన్నిహిత అనుచరులు దుర్మరణం పాలయ్యారు. పల్నాడులో కోడెల రాజకీయంపై రకరకాల ప్రశ్నలు ఎదురయిన సందర్భం అది.

నవ్యాంధ్రలో తొలి శాసనసభ స్పీకర్‌గా కూడా కోడెల వివాదాస్పదుడే అయ్యారు. టిడిపిలోకి ఫిరాయించిన వైసిపి శాసనసభ్యుల అనర్హత పిటిషన్‌లపై ఆయన నిర్ణయం తీసుకోకపోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. చివరికి ఆ వివాదం ఉన్నత న్యాయస్థానానికి వెళ్లింది. చివరికి స్పీకర్‌గా కోడెల ఎలాంటి నిర్ణయం  తీసుకోకుండానే శాసనసభ పదవీకాలం ముగిసిపోయింది.

కోడెల హోంమంత్రిగా ఉండగానే ఒక సారి నర్సరావుపేట నియోజకవర్గంలోని ఒక గ్రామంలో తన వర్గం వారు ఇబ్బందికి గురవుతున్నారన్న సమాచారం అందగానే వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా లేకుండా ఆయన అక్కడకు దూసుకువెళ్లారు. పోలీసులు ఆయనను వెంబడించి అక్కడకు చేరుకోవడంతో ప్రమాదం తప్పింది. కొన్ని దశాబ్దాల తర్వాత 70 ఏళ్ల పైబడిన వయస్సులో ఇటీవల కూడా ఆయన అదే దూకుడు ప్రదర్శించారు. 2019 ఎన్నికల పోలింగ్ రోజున తాను పోటీ చేస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనమెట్ల  గ్రామంలో దొంగఓట్లు వేస్తున్నారన్న సమాచారం అందడంతో కోడెల  హుటాహుటిన అక్కడకు వెళ్లారు.  ఇనమెట్ల  గ్రామం వైసిపికి కంచుకోట అని అందరికీ తెలుసు. అయినా కోడెల శివప్రసాదరావు అక్కడకు వెళ్లేందుకు వెనుకాడలేదు. అక్కడ ఆయనపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు, వెంటబడి తరిమారు. కోడెల రాజకీయ జీవితంలో ఈ తరహా పరాభవం ఆయనకు ఎదురుకావడం అదే మొదటిసారి, చివరి సారి.

వీడియో టిఒఐ సౌజన్యంతో…..ఇనమెట్లలో కోడెలపై దాడి ఘటన

 

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment