న్యూఢిల్లీ: ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీకి సోదరి ప్రియాంక నుంచి ప్రశంసలు అందాయి. ‘నువ్వు చేసిన పని చేయాడానికి కావాల్సిన ధైర్యం చాలా కొద్దిమందికి ఉంటుంద’ని ఆమె రాహుల్‌ను ఉద్దేశించిన ట్వీట్లో పేర్కొన్నారు. ‘నీ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో తాను ఇప్పటికే లేనని రాహుల్ గాంధీ బుధవారం స్పష్టం చేసి పార్టీలో కదలిక తెచ్చారు. తాను కొనసాగాలని కోరుతున్న పార్టీ నాయకులకు సమాధానంగా తన రాజీనామా లేఖను ట్విట్టర్లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేయడం గొప్ప గౌరవమని ఆయన అందులో పేర్కొన్నారు.
బుధవారం నాడే ఆయన పార్లమెంట్ ఎనెక్స్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇక జాప్యం చేయకుండా వీలైనంత త్వరలో ఆధ్యక్ష పదవికి ఎవరినన్నా ఎన్నుకోవాలని. మరో వారం రోజుల్లో రాహుల్ గాంధీ స్థానంలో అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.