హైదరాబాద్: దిశ హత్యాచారం కేసు నిందితుల ఎన్కౌంటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్పై దిశ తల్లిదండ్రులతో పాటు యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ ఎన్ కౌంటర్ పై ప్రజలతోపాటు సినీ సెలిబ్రిటీలు కూడా సోషల్ మీడియాలో పోలీసులను అభినందిస్తున్నారు. దిశకు న్యాయం జరిగిందటూ హర్షం వ్యక్తం చేశారు. సినీ సెలబ్రిటీలు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నాని, స్మిత, మంచు మనోజ్ తదితరులు తమ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. దిశకు న్యాయం జరిగిందని, ఆమె ఆత్మకి శాంతి చేకూరుతుందని తమ ట్వీట్ లో పేర్కొన్నారు.
“ఈ ఉదయం నిద్ర లేవగానే ఓ వార్తను విన్నాను. న్యాయం జరిగింది” అని టాలీవుడ్ హీరో నాగార్జున ట్వీట్ చేశారు. ‘ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది’ అంటూ మంచు మనోజ్ ట్విట్ చేశాడు.
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019
ఆ బుల్లెట్టు దాచుకోవాలని వుంది
ఆ తుపాకులకు దండం పెట్టాలని వుంది.
ఆ పోలీసుల కాళ్ళు మొక్కాలని వుంది.
నలుగురు చచ్చారు అనే వార్త లో ఇంత కిక్కు వుందా..??
ఈ రోజే నే ఆత్మ దేవుడ్ని చేరింది చెల్లెమ్మా..! #JusticeForDisha #Disha #justiceforpriyanakareddy pic.twitter.com/qQ05yD9mo3— Manoj Manchu??❤️ (@HeroManoj1) December 6, 2019
I ❤️ TELANGANA . Fear is a great solution and sometimes the only solution .
— Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2019
How far can you run away after committing a crime like Rape .. #JusticeForPriyankaReddy #Encounter ?? thankyou #Telangana police
— Rakul Singh (@Rakulpreet) December 6, 2019
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి
వాడు పోలీసోడు అయ్యుండాలి#Disha— Nani (@NameisNani) December 6, 2019
“అత్యాచారం చేసిన తరువాత ఎంత దూరం పారిపోతారు. థ్యాంక్యూ తెలంగాణ పోలీస్” అని రకుల్ ప్రీత్ సింగ్ ట్విట్ చేసింది. “ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయి ఉండాలి” అని నాని వ్యాఖ్యానించాడు. “ఒకప్పుడు నేను మరణదండనకు వ్యతిరేకం. కానీ కొంతకాలం క్రితం నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అత్యాచారాలకు పాల్పడితే ఉరి తీయాలి” అని మంచు లక్ష్మి పేర్కొంది.
I do NOT feel bad. I was always against capital punishment but I've changed my mind over the years. Rapists MUST hang! Thank you kcr garu for standing as an example to our nation and showing respect to women! @RaoKavitha @KTRTRS pic.twitter.com/DdXrDmyzSJ
— Lakshmi Manchu (@LakshmiManchu) December 6, 2019
Thank u sir. U have become our hero. When legal system fails/delays to deliver justice … this is what should happen. The country is with u?? God bless u #NoMercyToRapists #Disha pic.twitter.com/I4Onf7q4TB
— Smita (@smitapop) December 6, 2019