హైదరాబాద్: గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ దగ్గర ప్రమాదానికి కారణమైన కారు యజమాని కృష్ణమిలన్ రావుకు పోలీసులు వెయ్యి రూపాయలు ఫైన్ విధించారు. ప్రమాదానికి గురయ్యే సమయంలో కృష్ణమిలన్ కారును అతివేగంతో నడుపుతున్నట్టు స్పీడ్ గన్ ద్వారా గుర్తించిన పోలీసులు.. కారుకు వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసు వెబ్ సైట్ లో పొందుపరిచారు.
శనివారం మధ్యాహ్నం బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్పై కృష్ణమిలన్ నడుపుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ కింద ఆటో కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ మృతి చెందారు. కారు ఎయిర్ బెలూన్స్ బాక్స్ ఓపెన్ కావడంతో కృష్ణమిలన్ చిన్న గాయాలతో బయటపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు ఆయన వివరాలు సేకరించారు. ఇటీవలే ఆయనకు ఎంగేజ్ మెంట్ అయింది. కారు ప్రమాదంతో ఓ మహిళ మృతికి కారణమైన కృష్ణమిలన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Analysis of CCTV footage of today's accident on Biodiversity flyover shows that the car was traveling at a speed of 105.8 KMPH. Traveling at that speed, that too in the heart of the city, is totally irresponsible! pic.twitter.com/mJN0L26Yna
— Konatham Dileep (@KonathamDileep) November 23, 2019
CCTV footage from the flyover. https://t.co/N7gRmMsuIt pic.twitter.com/pxun51kqrc
— Bala (@Bala__G) November 23, 2019