టాప్ స్టోరీస్

కట్టు తప్పిన క్రూజ్ షిప్!

Share

https://youtu.be/-66QJG5kW6Y

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

విలాసవంతమైన ప్రయాణీకుల ఓడ ఒకటి కట్టు తప్పిన మదపుటేనుగులా వచ్చి ఒడ్డును ఢీకొట్టింది. అక్కడ ఆగి ఉన్న ఒక బోటును నెట్టుకుంటూ ఒడ్డును రాసుకుంటూ కొంతదూరం వెళ్లి ఆగింది. ఇటలీలోని వెనిస్ నగరంలో ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది.

65 వేల టన్నుల భారీ క్రూజ్ నౌక ఎంఎస్‌సి ఒపేరా రేవును రాసుకుంటా భూతంలా వస్తుంటే అక్కడున్న వారు భయంతో కేకేలు వేస్తూ, రోదిస్తూ కకావికలయ్యారు. వేరే టెర్మినల్‌లో ఆగడానికి గాడెక్కా కెనాల్‌ ద్వారా వెనిస్ నగరంలోకి వస్తున్న నౌక ప్రమాదవశాత్తూ శాన్ బాసిల్లో టెర్మినల్‌లోకి వచ్చి రేవును ఢీకొన్నది. అందులో 2100 మంది ప్రయాణీకులు ఉన్నారు. ప్రమాదంలో ముగ్గురు ప్రయాణీకులు గాయపడ్డారు.

నౌకలో సాంకేతిక లోపం తలెత్తి ఈ ప్రమాదం జరిగినట్లు క్రూజ్ షిప్ యాజమాన్యం వాషింగ్టన్ పోస్టు పత్రికకు తెలిపింది. ప్రమాదం తర్వాత నౌకను మామూలుగా వెళ్లాల్సిన టెర్మినల్‌కు పంపినట్లు  పోర్టు అధికారులు తెలిపారు.

ఎంఎస్‌సి ఒపేరా 2011లో కూడా ఇలాగే సాంకేతిక లోపంతో బాల్టిక్ సముద్రంలో ఆగిపోయింది. నౌకలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలడంతో వందలాది మంది ప్రయాణీకులును హెలీకాప్టర్ ద్వారా తరలించాల్సివచ్చింది.


Share

Related posts

జేసీబీకి ఎదురెళ్లిన మహిళా సర్పంచ్!

Mahesh

అపూర్వ కలయిక

Siva Prasad

పోలీసుల అదుపులో రవిప్రకాష్!

Siva Prasad

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar