NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఇన్ డైరెక్ట్ ‘వార్’ చేస్తున్న గవర్నర్… ప్రతిపక్షం తో పాటు జగన్ తోనూ !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్ఈసీ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం జరగాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం ప్రతిపక్షాలకు చాలా పెద్ద వార్త. గవర్నర్ నుండి తమకు సానుకూలంగా నిర్ణయం వెలువడినప్పుడు సహజంగా ప్రతిపక్ష పార్టీ వర్గాలు పండగ చేసుకుంటాయి. అంత కాకపోయినా అధికారపక్షాన్ని మంరింత ఉడికించేలా వ్యాఖ్యలు చేయడం వంటివి జరుగుతుంటాయి. అయితే ఇక్కడ మాత్రం అంతా మొక్కుబడిగా జరుగుతోంది. దీంతీ ఈ విషయం వెనక అసలు ఏదో మనకి తెలియనిది జరుగుతోంది అన్న అనుమానం అందరికీ కలగకమానదు.

 

Harichandan is Andhra Pradesh Governor - OrissaPOST

గవర్నర్ ను చూసి ఇంకా భయపడాల్సిందే

అసలు విషయం ఏమిటంటే నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఆదేశాలు ప్రతిపక్షాలకు అంత ఇంపార్టెంట్ కాదు. ఏదో జగన్ దొరికాడు అన్న ఆనందం మినహాయిస్తే ….నిమ్మగడ్డ కంటే కూడా రాజధాని అంశం ప్రతిపక్షాలకు అత్యంత ముఖ్యమైనది అని అందరికీ తెలిసిందే. ముందు నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే అతని మీద పడి పోయి అదే సమయంలో రాజధాని బిల్లు విషయం కూడా ఒకేసారి తేల్చేయవచ్చని వారి వ్యూహం. అయితే ఇప్పుడు నిమ్మగడ్డ పై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ట్విట్టర్లో పేర్కొన్నారు. అంతే…. అందులో అంతకుమించి ఒక్క పదం కూడా వైసిపి వారిని టార్గెట్ చేసేలా లేదాచివరికి న్యాయం బ్రతికిందిఅని ఎప్పుడూ తన స్టైల్ లో అయితే బాబు చేయలేదు. ఎందుకంటే ఇంకా రాజధాని విషయం మరియు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులు గవర్నర్ చేతిలోనే ఉన్నాయి.

ఇప్పుడు గంతులేస్తే అప్పుడు తెల్లమొహం వేయాలి

ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో మొదటి నుండి తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్ తమకు ఇలా షాక్ ఇచ్చాడని వైసిపి వారు అనుకుంటున్న నేపథ్యంలో టిడిపి వారు వారి ముందు గంతులు వేస్తే ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం బిల్లులపై వైసిపికి అనుకూలంగా తీర్పు ఇచ్చినా…. వ్యతిరేకించడానికి వీలు ఉండదు. కాబట్టి ముందు తమకు అత్యంత ప్రాధాన్యమైన విషయంపై గవర్నర్ తీర్పుకోసం వేచి చూస్తూ ఈ విషయంలో పెద్దగా తమకు పెద్దగా ఉపకరించేది కానీ వైసిపి కి పోయేది కానీ ఏమీ లేదు అన్నట్లు టిడిపి వ్యవహరిస్తోంది. ఇది ఒక కొత్త తరహా రాజకీయం అనుకోండి.

ఇంతకీ గవర్నర్ యుద్ధం ఎవరితో..?

ఎంతైనా మొదట నిమ్మగడ్డ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగబద్ధంగా లేకపోయినా సంతకం చేసిన గవర్నర్ చిక్కుల్లో పడ్డాడు అని చెప్పాలి. ఆ తర్వాత అటు ప్రతిపక్షంతో పాటు ఇటు అధికార పక్షంతోనూ యుద్ధం చేసుకుంటూనే వున్నాడు. ఒకపక్క హైకోర్టు నేరుగా గవర్నర్ ను నిమ్మగడ్డ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. గట్టిగా చెప్పాలంటే అతని నియామకం నువ్వే జరపాలి అన్నట్లు చెప్పింది. ఇక రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయానికి వస్తే ఇదే విషయాన్ని అప్పుడేమో వైసిపి సెలక్ట్ కమిటీకి పంపాలి అని చెప్పి హైకోర్టులో విచారణ తప్పించుకుంది. ఇప్పుడు గవర్నర్ ఆమోదిస్తే హైకోర్టు వైసీపీ మరియు గవర్నర్ పై మండిపడతారు. మీకు నచ్చినప్పుడు సెలక్ట్ కమిటీకి పంపాము అని చెప్పడం ఇలా దొడ్డిదారిలో దానిని అమలు చేయడం అంతా మీ ఇష్టమా అన్నట్లు ప్రశ్నలు తలెత్తుతాయి ఇంకా ప్రతిపక్షం వారు ఈ అండ చూసుకొని గవర్నర్ పై రెచ్చిపోతారు.

దీంతో గవర్నర్ కూడా అధికారపక్షానికి ఊతంగా మాట్లాడేందుకు ఇప్పుడు మొగ్గు చూపటం లేదు కాబట్టి అటు ప్రతిపక్షం తో మరియు అధికారపక్షంతో గవర్నర్ యుద్ధం చేస్తూనే ఉండాలి. అతని నిర్ణయంలో కచ్చితత్వం రావాలంటే అతను కొంత సమయం తీసుకుంటారు కానీ ప్రస్తుతానికైతే రాజధాని విషయమై చంద్రబాబు పంపిన లేఖ ఇప్పటికే అతడిని తీవ్రంగా ఆలోచింపజేస్తుండగా గవర్నర్ రెండు పార్టీల తో చేస్తున్న యుద్ధంలో ఒకరితో ఓడిపోయి మరొకరిని గాయపరిచేది మాత్రం ఖచ్చితం. అది ఎవరన్నదే సస్పెన్స్….

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju