NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

అమ్మో లీకులు..! ప్రభుత్వానికి షాకులు..!

రాష్ట్రంలో గత అయిదారు నెలలుగా జరుగుతున్న పరిశ్రమల్లో వరుసగా లీకేజ్ ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి, ఇవన్నీ యాదృశ్చికంగా, ప్రమాదవశాత్తు జరుగుతున్నా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టేవిగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి.

 

Gas leakage victims

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే విశాఖ ఫార్మాసిటీలో రియాక్టర్ నుండి విషవాయువు లీకేజీ ప్రమాదం జరిగింది. ఎల్ జీ పాలిమర్స్ ప్రమాదంలో 12మంది మృతి చెందగా దాదాపు వెయ్యి మంది అస్వస్థతకు గురైయ్యారు. విశాఖ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా కృష్ణాజిల్లా కైకలూరులోని రొయ్యల కంపేనీలోనూ అమ్మోనియం గ్యాస్ లీకై ఆరుగురు ఆస్వస్థతకు గురి అయ్యారు. జూన్ నెలలో కర్నూలు జిల్లా నంద్యాల అగ్రో కంపెనీలోనూ ఆమ్మెనియం గ్యాస్ లీకేజ్ అియి అగ్నిప్రమాదం సంభవించిఁది.

ఈ ఘటనలో ఫ్యాక్టరీ జీఎం మృతి చెందగా మరో ముగ్గురు అస్వస్థతకు గురైయ్యారు. తాజాగా చిత్తూరు జిల్లాలో పూతలపట్టు పాల డైయిరీలో గ్యాస్ లీకేజ్ ప్రమాదం కలకలం రేపింది. పూజలపట్టు మండలం బండపల్లి గ్రామ సమీపంలోని హాట్సన్ పాల డెయిరీలో ఆమ్మోనియం గ్యాస్ లీకేజ్ కావడంతో 14మంది అస్వస్థతకు గురి అయ్యారు. బాధితులను చిత్తూరు చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడం అదృష్టమే.

గ్యాస్ లీకేజీ ప్రమాదాలకు తోడు అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఇటీవల విశాఖ విశాఖ ఫిప్ యార్డ్ లో భారీ క్రేన్ కుప్పకూలిన ఘటన, అనంతరం ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలు అన్నీ దాదాపు ప్రమాదవశాత్తు గానో యాజమాన్యాల నిర్లక్ష్యం తోడుగానో జరుగుతున్నవే. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాధ ఘటనలో పోలీసు ధర్యాప్తు కొనసాగుతునే ఉంది. ఈ ఘటనలో రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చర్యలు చొపట్టడంతో పాటు వారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించింది ప్రభుత్వం.

ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే యాజమాన్యానాలు భద్రతా నియమాలు పాటించడం లేదనీ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రమదాలు జరుగుతున్నాయి అంటున్నారు. ప్రమాదం జరిగిన తరువాత బాధితులను ఆదుకోవడంతో గత ప్రభుత్వాలకు మించి జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతూనే ఉంది. ప్రతిపక్షాలు నోరు ఎత్తలేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా బాధిత కుటుంబాలకు భారీగా పరిహారం అందజేస్తుండటం సంతోషదాయకమే.

అయినా ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ అధికార యంత్రాంగంపైనే ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ప్రమాదాలు జరుగుతుండటం ప్రభుత్వానికి కొంత వరకూ ఇరుకున పెట్టే అంశమే. ప్రతిపక్షాలు కూడా వీటిని అస్త్రంగా వాడుకుంటుంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రమాదాలు జరగకముందే ముందస్తు చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు పరిశ్రమలను తనిఖీలు, నిబంధనలు పాటించని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగవనే మాట వినిపిస్తుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!