(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భూతాపం వల్ల కలిగే దుష్ఫలితాలను మనం అనుభవిస్తూనే ఉన్నాం. అటు కరువు, ఇటు వరదలు ఆ దుష్పరిణామాలలో భాగమే. ఇంత జరుగుతున్నా భూతాపం లేదు, గీతాపం లేదు అనే వారు ఉన్నారు. అలాంటి వారిని గ్రీన్లాండ్ పంపిస్తే వారి విషయం అర్ధం కావచ్చు.
గ్రీన్లాండ్ అంటే సముద్రాలే ఎప్పటికీ గడ్డకట్టిపోయి ఉండే సీమగా మనకు తెలుసు. దానినే గ్రీన్లాండ్ ఐస్ షీట్ అని అంటారు. భూతాపం దుష్పరిణామాలకు ఆ ఐస్ షీట్ కరిగిపోతోంది. ఈవారంలో గ్రీన్లాండ్ ఐస్ షీట్ ఉపరితలం కరగడం మొదలయింది. దాదాపు 60 శాతం ఉపరితలంలో ఐస్ కరగడం కనబడుతోంది. జూలై 31న ఈ కరగడం మరీ ఎక్కువగా కనబడింది. 2012 తర్వాత ఇంత ఎక్కువ కరగడం ఇదే ప్రధమమని శాస్త్రవేత్తలు అంటున్నారు.
This is a roaring glacial melt, under the bridge to Kangerlussiauq, Greenland where it's 22C today and Danish officials say 12 billions tons of ice melted in 24 hours, yesterday. pic.twitter.com/Rl2odG4xWj
— Laurie Garrett (@Laurie_Garrett) August 1, 2019
ఆ రోజున కనీసం ఒక మిల్లీమీటర్ మందంలో ఉపరితల ఐస్ కరిగిఉంటుందని అంచనా. ఒక మిల్లీమీటరు మందమేగా అనుకుంటున్నారా! ఆ కాస్త కరగడం వల్ల వెయ్యి కోట్ల టన్నుల ఐస్ సముద్రం పాలయింది. జూలై నెల మొత్తం మీద దాదాపు 19, 700 కోట్ల టన్నుల ఐస్ కరిగి సముద్రం పాలయిందని అంచనా. దీనివల్ల సముద్రాల నీటిమట్టం ఒక మిల్లీమీటరులో పదవ వంతు పెరుగుతుంది. ఇది కూడా కాస్తే కదా అనుకుంటున్నారు కదూ? దీనివల్ల సముద్రాలలో ఏర్పడే తుఫానులకు అనుకూల వాతావరణం తయారవుతుంది. తీర ప్రాంతాల ముంపు పెరుగుతుంది.