NewsOrbit
టాప్ స్టోరీస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

వివేకానంద హత్య కేసులో ఎం జరుగుతోంది? కోర్టు కీలక ఆదేశాలు

 

 

 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో బయటకు తెలియకుండా కొన్ని విషయాలు జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. కేసును హై కోర్ట్ ఆదేశంతో దర్యాప్తు చేస్తున్న సిబిఐ బృందానికి అడుగుఅడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కేసులో కీలక సాక్షాలను సేకరించేందుకు సిబిఐ అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కేసు చివరి దశలో వారికీ కోర్టు నుంచి కూడా సహకారం లభించలేదు. చివరకు తమకు కేసు అప్పగించిన హై కోర్టును మరోసారి దీనిలో జోక్యం చేసుకోవాలని కోరే పరిస్థితి వచ్చింది.

స్థానిక కోర్ట్ అభ్యన్తరాలు ఏంటి ?

కేసును నిరూపించేందుకు, నిందితులను గుర్తించేందుకు ప్రాధమిక సాక్షాలు ఎంతో ఉపయోగపడతాయి. వివేకా హత్య జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. వారు కేసుకు సంబంధించి కొన్ని క్లూ లు సేకరించారు. తర్వాత ప్రభుత్వం ప్రత్యే దర్యాప్తు బృందం (సిట్) ఏరపాటు తర్వాత ప్రాధమిక సాక్షాలను, కేసు తాలూకా రికార్డులు కోర్టుకు అప్పగించారు. నిందితులెవరో తెలియకపోవడంతో ఎవర్ని అరెస్ట్ చేయలేదు. ఐతే ప్రాధమిక సాక్షాలను తమ వద్ద ఉంచుకోకూడదనే నిబంధన మేరకు వాటిని స్థానిక కోర్టులకు అప్పగించారు. ఆ తర్వాత కేసు సిబిఐ వద్దకు వెళ్ళినపుడు ఆయా ఆధారాలను సిబిఐ అధికారులు మల్లి చూడలేదు. ఒక నేరం జరిగినపుడు మొదట సేకరించే ఆధారాలు, సాక్షాలకు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కేసు గుట్టు విప్పుతాయి. తర్వాత కొన్ని ఆధారాలు సీబీఐకు లభ్యం అయినా మొదట సేకరించిన అంశాల కంటే ఏది ఎక్కువ కాదు. అయితే వీటిని కోర్ట్ వద్ద భద్రం చేసిన అధికారులు తర్వాత ఆ విషయాన్నీ సిబిఐ కు చెప్పిన కోర్టులో ఉన్నది కాబట్టి ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే కోణంలో వారు మిన్నకున్నారు. ఇటీవల మొదటి, రెండో దశ దర్యాప్తు పూర్తి అనంతరం సిబిఐ కు దొరికిన కొన్ని ఆధారాలు మొదట ప్రాధమికంగా లభ్యం అయినా వాటిని పోల్చి చూడాలని భావించారు. అంతే కాకుండా ప్రాధమిక ఆధారాలను ఒకసారి పరిశీలించాలని అని అనుకున్న సమయంలో కోర్ట్ వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలను స్వాధీనం చేస్కుని సిబిఐ తరఫున స్థానిక పులివెందుల మొదటి తరగతి జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ను కోరితే దానికి కోర్ట్ ససేమిరా అంది. పోలీసులు అందించిన సాక్షాలు దర్యాప్తు మధ్యలో మల్లి ఎవరికో అప్పగించకూడదని న్యాయమూర్తులు భావించారు. ఇది న్యాయ పరంగా సరి అయినదే అయినా సిబిఐ దర్యాప్తులో కేసు ఉంది కాబట్టి వారికీ సహకరించడం అవసరమే. కేసులో చిక్కుముడులు, సరి ఐనఅంశాల నిర్ధారణ కీలకం కాబట్టి సిబిఐ మొదటి ఆధారాలను తప్పక పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది.
దింతో సిబిఐ హై కోర్టును ఆశ్రయించగా, ప్రాధమిక సాక్షాలు అప్పగించాలని స్థానిక కోర్ట్ ను ఆదేశించింది.

ఎం జరుగుతుంది ?

కేసు రెండో దశ పూర్తి అయ్యే సమయంలో కేసులో మొదట జరిగిన అంశాలతో సరిగా సరిపోల్చుకుని అన్ని అంశాలు, లీగల్గా కేసు బలంగా నిలిపేందుకు సిబిఐ కసరత్తు చేస్తున్నది. కేసులో నిందితులను ఇప్పుడే అరెస్టులు చేస్తే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం, గొడవలు పెరిగే అవకాశం ఉంటుందని ఇంటిలిజెన్స్ ద్వారా నివేదిక తెప్పించుకున్న సిబిఐ అధికారులు ఈ కేసు చివర్లోనే పూర్తి వివరాలను కోర్టుకు తెలియజేసి, అనంతరమే నిందితుల్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కోర్ట్ ఆదేశం తో మొదలైన విచారణ కావడంతో పూర్తి పర్యవేక్షణ హై కోర్ట్ తీసుకుంటుంది. కేసు వివరాలన్నీ నివేదిక రూపంలో కోర్టుకు సిబిఐ అప్పగిస్తుంది. తర్వాత కోర్ట్ డైరెక్షన్లోనే నిందితుల అరెస్టులు, వారిని న్యాయస్థానం ముందు నిలిపే అంశాలు దీనిలో కలిసి ఉంటాయి. ఇప్పటికే సుమారు 6 నెల్లలుగా 250 మందిని వివిధ రకాలుగా విచారించి నిజానిజాలు తెలుసుకున్న సిబిఐ వద్ద పూర్తి విషయాలు, వాస్తవాలు ఉన్నట్లు అర్ధం అవుతుంది. దీనిని మరి కొద్దీ రోజుల్లోనే కోర్టుకు తెలిపి, విచారణ మొదలు పెట్టె అవకాశం ఉంది.

author avatar
Special Bureau

Related posts

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?