NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గవర్నర్ లను బీజేపీ ఎలా వాడుకుంటుందంటే..??

 

ఆంధ్రప్రదేశ్ లో బిజెపికి ఓట్లు లేవు. సీట్లు లేవు. కానీ ఉనికి లిగి ఉంది. ఇప్పుడు ఒక శాతం ఉన్న ఓట్లను 2024 నాటికి 10 శాతం పెంచుకోవాలనేదే ఆ పార్టీ లక్ష్యం. ఇది పక్కన పెడితే.. మహారాష్ట్ర, కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఆ ఆ పార్టీకి ఓట్లు ఉన్నాయి. సీట్లు ఉన్నాయి. అందుకే అధికారానికి కావాల్సిన సీట్లు రానప్పటికీ తన చేతిలో ఉన్న వ్యవస్థల ద్వారా అధికారాన్ని దక్కించుకోగల్గింది. ఈ వ్యవహారాలన్నీ ఎలా జరిగాయో చూస్తూనే ఉన్నాం. తాజాగా రాజస్థాన్ లో కూడా బిజెపి ఇదే వ్యూహంలో పయనిస్తోంది. నేడో రేపో అన్నట్లుగా రాజస్థాన్ అధికార పీఠం బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే.. మళ్ళీ ఏపీ విషయానికి వస్తే ఏపీలో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఆయుధం, అస్త్రం గవర్నర్. దేశవ్యాప్తంగా బీజేపీ కావాల్సిన అనేక రాష్ట్రాల్లో గవర్నర్ ల వ్యవస్థతోనే బిజెపి శాసిస్తోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

How does the BJP use governors

ఏ రాష్ట్రంలో ఎలా?

* మధ్యప్రదేశ్ లో ఏమి జరిగింది అంటే అక్కడి కాంగ్రెస్ లోని అసమ్మతిని బీజేపీ అందిపుచ్చుకొని కమలనాధ్ సర్కార్ ను కూల్చేసింది. కాంగ్రెస్ నేత జ్యోతి రాధిత్యసింధియా తన మద్దతు దారులు 22మంది ఎమ్మెల్యేలో బీజేపీకి జంప్ చేయడంతో కమలనాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. అక్కడ కేంద్రంలోని బీజేపీ.. గవర్నర్ తో చక్రం తిప్పి శివరాజ్ సింగ్ చౌహన్ నేతృత్వంలో బీజేపీ ప్రభుతాన్ని ఏర్పాటు చేయడం చూశాం.

* కర్ణాటక విషయంకు వస్తే కాంగ్రెస్, జేడీఎస్ కూటమితో ముఖ్యమంత్రిగా ఉన్న కుమార స్వామి ప్రభుత్వం అసమ్మతి వర్గం ఎమ్మెల్యేల రాజీనామాతో మైనార్టీలో పడిపోయింది. తెర వెనుక చేయాల్సిన పనులు అన్నీ చేయడం, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా పీఠం అధిష్టించడం చూశాం.

* మహారాష్ట్రలో ఏమి జరిగింది అంటే..రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ కలసి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటుండగా కేంద్రంలోని బీజేపీ నేతలు పావులు కదిపి ఎన్సీపీలో చీలిక తీసుకువచ్చి సృష్టించి అర్ధరాత్రి ఉత్తర్వులతో వేకువజామునే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ను గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించడం చూశాం. ఇక్కడ బీజేపీ వ్యూహం బెడిసికొట్టడం, ఎన్సీపీ, శివసేన ప్రతి వ్యూహం సక్సెస్ కావడంతో నాలుగు రోజులకే ఫడ్నవీస్ సీఎం కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఇక్కడ ఎన్సీపీ నేత శరద్ పవర్ చాణిక్యతతో శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే ముఖ్యమంత్రి పీఠం అధిష్టించారు. బీజేపీ ఎత్తులు ఇక్కడ పారలేదు.

* ఇప్పుడు రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వంతు వచ్చింది. అక్కడ డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్..గెహ్లట్ ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగుర వేయడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యేల బేరసారాలపై ఆడియో టేపులు లీక్ కావడం, కేసులు నమోదు చేసి దర్యాప్తులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయం కొనసాగుతోంది. బలపరీక్షలో గెహ్లాట్ నెగ్గుకొస్తారా లేదా అని కొద్ది రోజుల్లో తేలనుంది.

* ఏపీలో కూడా గవర్నర్ ద్వారా అట

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్ఈసీ పదవీ కాలం తగ్గింపు ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదించడం, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కానగరాజ్ ను ఎస్ఈసీగా నియామకం చేయడం అనంతరం హైకోర్టు ఈ ఆర్డినెన్సును రద్దు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తిరిగి ఎస్ఈసీ గా నియమించారు. ఇకపోతే రాష్ట్రంలో హాట్ టాపిక్ అయిన మూడు రాజధానుల అంశానికి సంబందించిన పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించగా  ఇది కూడా న్యాయ సమీక్ష కు చేరింది. ఇప్పుడు ఏమవుతుందంటారు. మీరు గెస్ చేయండి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju