టాప్ స్టోరీస్

డొరియన్ తుపాను బీభత్సం

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అట్లాంటిక్ మహా సముద్రంలో ప్రచండమైన శక్తిగా మారిన ‘డొరియన్’ తుపాను బీభత్సం సృష్టించింది. బహామా దీవులపై విరుచుకుపడిన డొరియన్ తుపాను.. గడిచిన 24 గంటలల్లో కదలకుండా అక్కడే కేంద్రీకృతమైంది. ప్రచండ వేగంతో వీచిన గాలులకు ఇళ్ల కప్పులు లేచిపోయాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.

తుపాను ధాటికి ఐదుగురు మృతి చెందారు. సుమారు 13 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న పెనుగాలులు బహామా దీవులను అల్లకల్లోలానికి గురి చేశాయి. మంగళవారం కాటగిరీ 3 దీనిని వర్గీకరించారు. 100 కిలో మీటర్ల వేగంగా అమెరికాలోని ఫ్లారిడా తీరంపై డొరియన్ విరుచుకుపడింది. తుపాను నేపథ్యంలో ఇప్పటికే జార్జియా, దక్షిణ కరోలీనా రాష్ట్రాలు తీర ప్రాంతవాసులకు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే 1300 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ రోజు మరో వెయ్యి విమాన సర్వీసులను కూడా రద్దు చేసే అవకాశం ఉంది.


Share

Related posts

ఇక శాసనసభ్యుల వంతు!?

somaraju sharma

సీఎం జగన్ ఆదేశంతో కోటం రెడ్డి అరెస్టు!

Mahesh

లోగుట్టు వైసిపి ఎంపీలకెరుక!

Siva Prasad

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar