NewsOrbit
టాప్ స్టోరీస్

డక్‌వర్త్ లూయీసా మజాకానా!

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రపంచ కప్ క్రికెట్‌లో దాయాదుల పోరు కోసం ఒక్క ఇండియా, పాకిస్తాన్‌లోని ఫ్యాన్ మాత్రమే కాదు. అన్ని క్రికెట్ దేశాలలోని అభిమానులూ ఎదురుచూశారు. అయితే మ్యాచ్ ఆశించినంత మజా ఇవ్వలేదు. వరుణుడు మధ్యలో వచ్చి ఆట పాడు చేశాడు. వరుణుడి సంగతేమో కానీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) పెట్టిన డక్‌వర్త్ లూయీస్ నిబంధన మాత్రం తీవ్ర విమర్శలకు గురయింది.

వర్షం వచ్చి ఆట ఆగిపోయేసరికి పాకిస్థాన్ స్కోరు ఆరు వికెట్లకు 166 పరుగులు. వర్షం కారణంగా మ్యాచ్ అక్కడే ఆగిపోయిఉంటే డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం పాకిస్తాన్ 86 పరుగుల తేడాతో ఓడిపోయినట్లు ప్రకటించేవారు. కానీ వర్షం ఆగిపోయి ఆట మళ్లీ మొదలయిది. ఆ డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారమే మ్యాచ్ 40 ఓవర్లకు కుదించి ఈసారి పాకిస్తాన్‌కు అయిదు వోవర్లలో 136 పరుగుల లక్ష్యాన్ని విధించారు. ఫలితం మనకందరికీ తెలిసిందే. పాకిస్తాన్ 89 పరుగుల తేడాతో ఓడిపోయింది.

దీనిని చాలామంది కామెంటేటర్లు ఫార్సుగా అభివర్ణించారు. బిబిసి రేడియో కామెంటేటర్, ఇంగ్లండ్ మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ శ్వాన్ ఏమన్నాడో చూస్తే ఇది ఎంత ఫార్సు కింద కనబడిందో అర్ధమవుతుంది. ఇంటి దగ్గర కూర్చుని ఈ మ్యాచ్ చూస్తూ పిల్లలకు ఇదేంటో వివరించాల్సివస్తే, కొన్నిసార్లు పెద్దవాళ్లు చేసే పనులకు అర్ధం ఉండదని చెప్పాలి అన్నాడు గ్రేమ్ శ్వాన్.

కానీ ఐసిసి మాత్రం దీనిని సమర్ధించుకుంటున్నది. నెట్ రన్‌రేట్ ప్రకారం సెమీఫైనలిస్టులను నిర్ణయించాల్సివస్తే ఇది లెక్క విలువ తెలుస్తుందనీ, పాకిస్తాన్ ఓడిపోయినట్లు ముదే ప్రకటించడం ఆ టీముకి అన్యాయం చేసినట్లన్న విషయం అప్పుడు అర్ధం అవుతుందనీ ఐసిసి ప్రతినిధి ఒకరు ఎఎఫ్‌పి వార్తా సంస్థకు చెప్పినట్లు ఎన్‌డిటివి పేర్కొన్నది.


Share

Related posts

అమ్మాయిలపై నోట్లు జల్లుతారా..

Kamesh

దిశ కేసులో చార్జిషీట్ రెడీ ?

Mahesh

వైసీపీలో చేరుతారా? రాజకీయాలను వీడుతారా?

Mahesh

Leave a Comment