విదేశాల్లో రికార్డు పరుగులు చేసిన కోహ్లి

అస్ర్టేలియా: భారత క్రికెట్ సారధి విరాట్‌ కోహ్లీ తన టెస్టు కెరీర్‌లో రికార్డు సాధించాడు. ఒక ఏడాదిలో విదేశాల్లో అత్యధిక పరుగులు సాధించిన టీమిండియా బ్యాట్స్‌మెన్‌గా తొలివరుసలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పేరు మీద ఉంది. 2002లో విదేశీ గడ్డపై ద్రవిడ్‌ 1137 పరుగులు చేశాడు. అప్పటినుంచి 16 సంవత్సరాల తర్వాత ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న టెస్టుల్లో కోహ్లీ 1138 పరుగులు చేసి రికార్డును బ్రేక్ చేశాడు. ద్రవిడ్‌ కంటే ముందు 1983లో మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1065 పరుగులు చేయగా, 1971లో సునీల్ గావస్కర్‌ 918 పరుగులు చేశారు. టెస్టులో కోహ్లీ వ్యక్తిగతంగా మరో మైలురాయినీ అందుకున్నాడు. కోహ్లి టెస్టుల్లో అత్యధికంగా ఆసీస్‌ జట్టుమీద 1573 పరుగులు చేయగా, ఇంగ్లండ్‌పై 1570, శ్రీలంకపై 1005 పరుగులు సాధించాడు.