కోల్‌కతా: ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాదాలకు నమస్కరిస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యూనిఫామ్‌లో ఉన్న వెస్టర్న్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ మిశ్రా మమతా బెనర్జీ పాదాలను తాకడం ఈ వీడియోలో కనబడపతుంది. గత వారం ముఖ్యమంత్రి కోల్‌కత్తాకు 200 కిలో మీటర్ల దూరంలోని తీర పట్టణం ధిగా పర్యటనకు వెళ్లినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.
మమతా బెనర్జీ ఒక పిట్టగోడపై కూర్చుని డబ్బాలోంచి కేక్ తీసి మొదట మరో సీనియర్ పోలీస్ అధికారి నోట్లో పెట్టారు. తర్వాత రాజీవ్ మిశ్రా నోట్లో పెట్టారు. ఆ వెంటనే మిశ్రా మమతాదీ పాదాలకు నమస్కరించారు.
ఈ వీడియోను బిజెపి నేత కైలాష్ విజయ్ వర్గీయ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. బిజెపి దీని గురించి మమతా బెనర్జీపై విమర్శలు ప్రారంభించింది.
दीदी के सामने वर्दी नतमस्तक !!!
पश्चिम बंगाल के पश्चिमी झोन के पुलिस IG राजीब मिश्रा ने वर्दी में ममता बैनर्जी का चरणवंदन किया! ये कैसी व्यवस्था और कैसा लोकतंत्र है? pic.twitter.com/S0aKbkGsjZ
— Kailash Vijayvargiya (@KailashOnline) August 28, 2019