NewsOrbit
టాప్ స్టోరీస్

ఆడపడుచులకు శుభవార్త:పెండింగ్ పెళ్లి కానుకల నిధులు విడుదల

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: ఏపీలోని పేదింటి ఆడపడుచులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి కానుకుల కోసం పెండింగ్‌లో ఉన్న రూ.270 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దాదాపు 22 నెలలగా ఎదురు చూస్తున్న జంటల వ్యక్తిగత అకౌంట్లలలోకి డబ్బులు జమకానున్నాయి.

పెంచిన నగదు శ్రీరామ నవమి నుండి అందజేత…
పేదింటి పిల్లల పెళ్లిళ్లలకు మరింత సాయం చేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయం కార్యరూపం దాల్చింది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులకు చంద్రన్న పెళ్లి కానుకగా చెల్లిస్తున్న ప్రోత్సాహకాన్ని భారీగా పెంచి పథకాన్ని సరికొత్తగా వైఎస్సార్‌ పెళ్లి కానుకగా మార్చారు. పెంచిన నగదును రానున్న శ్రీరామ నవమి నుంచి అమలు చేయనున్నారు. గతంలో ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు పెళ్లి కానుక కింద ఇచ్చేవారు. ప్రస్తుతం వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద వారందరికీ ఏకంగా లక్ష రూపాయలను ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు ఇస్తున్న రూ.75 వేల ను ఇప్పుడు రూ.1.20 లక్షలకు పెంచారు. బీసీ ఆడపడుచులకు ఇస్తున్న రూ.35 వేలను రూ.50 వేలకు, కులాంతర వివాహాలు చేసుకొనే ఆడపడుచులకు రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ.50 నుంచి రూ.లక్షకు, దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

భవన నిర్మాణ కార్మికులకు అయిదు రెట్లు పెంపు…
భవన నిర్మాణ కార్మికుల పెళ్లి కానుకను వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం భారీగా పెంచింది. ఏకంగా అయిదు రెట్లు పెంచి రూ.20 వేల నుంచి రూ.లక్షకు చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు ఆగ్రవర్ణ పేదలు ఎవరైనా భవన నిర్మాణ కార్మికులగా పనిచేస్తూ కార్మిక శాఖలో నమోదు చేసుకుంటే వారి కూతుర్లకు కూడా పెళ్లి కానుకను అమలు చేస్తున్నారు. అయితే భవన నిర్మాణ కార్మికులుగా నమోదు చేసుకొనే వారి సంఖ్య తక్కువగా ఉందని ఆధికారులు చెబుతున్నారు. అవగాహన లేకపోవటంతో ప్రభుత్వ సాయానికి వీరు దూరం అవుతున్నారంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు దగ్గరలోని ఆసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత పత్రాలు, తగిన రుసుం చెల్లించి గుర్తింపు కార్డు పొందవచ్చని ఆధికారులు తెలియచేస్తున్నారు.

పెంచిన పెళ్లి కానుక వివరాలు.

  • ఎస్సీలకు రూ.40 వేల నుంచి రూ.లక్ష
  • ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహానికి రూ.75 వేల నుంచి రూ. లక్షా 20 వేలు
  • ఎస్టీలకు రూ.50వేల నుంచి రూ.లక్ష
  • బీసీలకు రూ.35వేల నుంచి రూ.50 వేలు
  • బీసీ కులాంతర వివాహానికి రూ.50 వేల నుంచి రూ.75 వేలు
  • మైనార్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష
  • దివ్యాంగులకు రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర
  • భవన నిర్మాణ కార్మికులకు రూ.20 వేల నుంచి రూ.లక్ష

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment