ఫ్రెంచ్ నగరం కేన్‌లో పర్సనల్ జెట్ప్యాక్తో 2018లో ఎగురుతున్న జెట్ప్యాక్ సంస్థ సిఇఒ డేవిడ్ మేమాన్
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసింది నిజం కాబోతుంది. నిట్టనిలువుగా గాల్లోకి ఎగిరి మళ్లీ అట్లాగే కిందకు దిగే మోటార్‌బైక్ త్వరలో మార్కెట్లోకి రానుంది.
కాలిఫోర్నియాకు చెందిన జెట్ప్యాక్ ఏవియేషన్ అనే సంస్థ ఈ ఫ్లయింగ్ బైక్ రూపొందించింది. నమూనాను పరీక్షిస్తునట్లు ఆ కంపెనీ తెలిపింది. దీనికి స్పీడర్ అని పేరు పెట్టారు. దీని ధర మాత్రం కాస్త ఎక్కువే. మూడు లక్షల 80 వేల డాలర్లు. అంటే రెండున్నర కోట్ల రూపాయల పైమాటే.
స్పీడర్ గంటకు 240 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఒకసారి గాల్లోకి ఎగిరితే 45 మైళ్ల వరకూ ప్రయాణించగలదు. గాల్లో 15 వేల అడుగుల ఎత్తు వరకూ వెళ్లగలదు. వచ్చే సంవత్సరం స్పీడర్ను మార్కెట్లో ప్రవేశపెట్టాలని జెట్ప్యాక్ అనుకుంటోంది.
స్పీడర్ అడుగుభాగంలో అయిదు జెట్ ఇంజిన్లు ఉంటాయి. జెట్ప్యాక్ సంస్థ పర్సనల్ జెట్‌ప్యాక్స్ తయారుచేసి విక్రయిస్తుంది. దీని సిఇఒ డేవిడ్ మేమాన్ 2015లో పర్సనల్ జెట్ప్యాక్ నడుముకు బిగించుకుని న్యూయార్క్ లిబర్టీ స్టాచ్యూ చుట్టూ ఎగిరాడు.
ఎగిరే సొంత వాహనాలు ఇక మీదట సినిమాలకే పరిమితం కావు. ఉబర్, ఎయిర్‌బస్, వోలోకాప్టర్ వంటి సంస్థలు ఇప్పటికే వీటిని రూపొందించే పనిలో ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీలో వాహనం నడిపి బిపి తెచ్చుకోవాల్సిన అవసరం లేని రోజు త్వరలోనే వస్తుంది. అయితే కాస్త డబ్బు ఖర్చవుతుంది అంతే.
వాషింగ్టన్ పోస్ట్ సౌజన్యంతో
https://www.instagram.com/p/Buu7ZGGHkzJ/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again