(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని పేర్కొంటూ టీడీపీకి చెందిన ఓ నేత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కలకలం రేపింది. ఎన్టీఆర్ అవసరం పార్టీకి లేదని పార్టీ పెద్దలు చెబుతున్న క్రమంలో టీడీపీ నేత 2024లో ఎన్టీఆరే సీఎం అని ఫ్లెక్సీలో ముద్రించాడు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూదాల అజితారావుకు శుభాకాంక్షలు చెబుతూనే, 2024లో ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ.. ఆయన ఫోటోను కూడా ముద్రించారు. ఆ ఫ్లెక్సీని పార్టీ కార్యకర్తలే ఏర్పాటు చేశారు. అయితే, ఆ ఫ్లెక్సీలో చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
https://www.facebook.com/NextCmNtr/photos/a.428897027542902/846331685799432/?type=3&eid=ARCEKNC-Ui3_tVE0FHE050DuUa_fmDWSI3wqWu_NwgRgpGDXjLCF9dWulvFbu0-Ga_4RavMF7OSAM4vq&__xts__%5B0%5D=68.ARDE6E_FRJun1lpavdwFwFAzHJOF7rj0dFr1LL_qMwAahd6JxHubOqrDN9T6lp0uAqDqXaWOveoYTK85qFzObv7BFkvPZVOYkuxoJtjgcvQTlGWzrpgYrw7wt-CqULnGoUlRnlQRXWrZyAzeByfu7paVCD9YigXYZXTLkQNgKS-SL16mA1pTih01bmQyG3MpEVPGcjNsv_xaCyUpSctFvWkJghrH7YK519TmIugxFSqaWe1p0mMMUU-lxA014gyUmFA708VjL9o8AKcwPDmedQoXHQAujaWnlucZhe9zsfDTZFONwLLYVkrs6qVHZtPgxPLKiCe-ZyOES4E56aqu_z0&__tn__=EHH-R
అజితారావు యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతేకాదు ఆమె మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం బలరాంకు అనుచరురాలిగా ఉన్నారు. ఆమె అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం పార్టీలోని కొందరు నేతలు ఎన్టీఆర్ పేరును తెరపైకి తెచ్చారు. టీడీపీలో చంద్రబాబు వారసుడిగా తెరపైకి వచ్చిన లోకేశ్.. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయన సామర్థ్యంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉందని పలువురు నేతలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తారక్‌ను రంగంలోకి దించాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. ఈ ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్స్లో వైరల్ అవుతోంది. టీడీపీలోనూ హాట్‌టాపిక్ అయ్యింది. ఇదంతా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చేసారన్నప్పటికీ ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.