NewsOrbit
టాప్ స్టోరీస్

ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుందో!?

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మళ్లీ సమావేశం కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కెసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 24న సమావేశం కానున్నారు. ఇప్పటికి మూడు సార్లు వీరిద్దరూ కలిసి ఉమ్మడి సమస్యల గురించి చర్చించారు. ఇప్పుడు నాలుగవ సారి కలవబోతున్నారు.

రాష్ట్ర విభజన పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య తలెత్తిన సమస్యలు అన్నీ దాదాపు అలానే ఉన్నాయి. గత అయిదేళ్లుగా కెసిఆర్, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య సయోధ్య లేకపోవడం సమస్యలను పేరబెట్టింది. కొత్త ముఖ్యమంత్రి జగన్ సామరస్యంగా వ్యవహరించడం, హైదరాబాద్ సచివాలయంలో ఆంధ్రకు కేటాయించిన భవనాలు తెలంగాణకు బేషరతుగా అప్పగించడం పరిస్థితిలో మార్పు తెచ్చింది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ప్రకటించిన వాటిలో కృష్ణా బేసిన్‌కు తరలించడం ద్వారా గోదావరి జలాల ఉమ్మడి వినియోగం అన్నిటికన్నా పెద్ద నిర్ణయం. దానికి సంబంధించిన రిజర్వాయర్ తెలంగాణలో నిర్మించడం అన్న ప్రతిపాదనకు ఆంధ్రలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది. జగన్ మాత్రం దీనిపై నోరు విప్పలేదు. ఈ అంశం ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల ఇంజినీరింగ్  నిపుణుల పరిశీలనలో ఉంది. దీనిపై ఈసారి సమావేశంలో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.

కెసిఆర్ మాయలో పడి జగన్ నదీ జలాల వినియోగం విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తారేమోన్న భయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రాలు స్నేహంగా ఉండాలంటూనే తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జలవనరుల వినియోగానికి సంబంధించిన పలు అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా వరద సమయంలో తరలించే నీటిని కేటాయింపుల లెక్క కిందకు తీసుకురావద్దన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కూడా తెలంగాణ వ్యతిరేకించింది.

కెసిఆర్ బయటకు ఎవరితో ఎలా వ్యవహరించినా ఆయన ఎల్లప్పుడూ తెలంగాణ ప్రయోజనాల గురించే ఆలోచిస్తారనీ, ఆయన నుంచి పొరుగు రాష్ట్రం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఆశిస్తే భంగపడక తప్పదనీ కొందరు అంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేసి తెలంగాణ గడ్డపై నీటిపారుదల వ్యవస్థలు నిర్మిస్తే భవిష్యత్తులో వాటిపై అదుపు ఉంటుందన్న నమ్మకం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా కీలకమైన ఇలాంటి అంశాలలో వైసిపి ప్రభుత్వం అందరినీ సంప్రదించి నిర్ణయం తీసుకావలని అంటున్నారు. గోదావరి జలాల వినియోగం విషయంలో కెసిఆర్, జగన.. ఈ ఇద్దరిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

 

author avatar
Siva Prasad

Related posts

Ayodhya : జ‌న‌వ‌రి 22 : అయోధ్య రామ‌మందిరం ఓపెనింగ్‌.. మీ గ్రామాల్లో ఈ ప‌నులు చేయండి..!

Saranya Koduri

Subrata Roy: సుబ్రతా రాయ్ ఇక లేరు…సహారా గ్రూప్ స్థాపకుడుకి 75 సంవత్సరాలు, దీర్ఘకాలిక అనారోగ్యం తో కన్ను మూత.

Deepak Rajula

International Girl Child Day: అంతర్జాతీయ బాలికా దినోత్సవంపై స్పెషల్ స్టోరీ.. 2023 థీమ్ ఏంటి? దీని చరిత్ర..

siddhu

Amaravati Capital Case: అమరావతి రాజధాని కేసు డిసెంబర్ కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు .. ఏపీ సర్కార్ కు షాక్ | Supreme Court Shocks AP Govt in Amaravti Case 

sharma somaraju

Kuno National Park: కునో నేషనల్ పార్కుకు మరో 12 చిరుతలు.. ఈ పార్కుకు వెళ్లాలని అనుకుంటున్నారా? హైదరాబాద్, విజయవాడ నుంచి ఇలా వెళ్లండి!

Raamanjaneya

Mughal Gardens: అమృత ఉద్యాన్‌గా మొఘల్ గార్డెన్.. దీని చరిత్ర.. ప్రత్యేకతలు!

Raamanjaneya

థార్ డెసర్ట్‌లో ఇసుక తిన్నెలు నడుమ అద్భుతమైన ఆహారం,  ప్రదర్శనలు, కచేరీలు!

Raamanjaneya

KCR’s BRS: నూతన శాతవాహన సామ్రాజ్యం దిశగా పావులు కదుపుతున్న నయా శాతవాహనుడు సీఎం కేసీఆర్

sharma somaraju

ఆ ఇద్దరూ ఒకే వేదికపై ..! బీజేపీ భారీ ప్లాన్స్, సక్సెస్ అవుతాయా..!?

Special Bureau

Why Lawrence Bishnoi wants Salman Khan Dead? నాలుగు సంవత్సరాల నుండి సల్మాన్ నీ చంపడానికి ప్లాన్ చేస్తున్న దుండగులు..!!

Siva Prasad

PK Team: పీకే టీమ్ – 1500మంది రెడీ ..! వైసీపీ కోసం భారీ ప్లాన్స్..!

Special Bureau

YSRCP: ఈ విషయాలు గమనిస్తే దటీజ్ జగన్ అనాల్సిందే(గా)..?

sharma somaraju

Rahul Gandhi: వరంగల్ సభలో టీఆర్ఎస్ పై రాహుల్ సీరియస్ కామెంట్లు..!!

sekhar

Telangana Crime: భాగ్యనగరంలో అమానవీయ ఘటన! పదహారు మంది బాలల బట్టలూడదీసి కొట్టినా కిమ్మనని పోలీసులు,కెసిఆర్ సర్కారు!

Yandamuri

TDP ChandraBabu: కార్యకర్తలపై కేసులు.. బాబోరీ వెరైటీ కూతలు..!!

sekhar

Leave a Comment