శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జలాశయానికి 2.33 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..ఔట్‌ఫ్లో 100.961 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 884.81 అడుగుల నీటి మట్టం నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టిఎంసిలు కాగా ప్రస్తుతం 214.50 టిఎంసిల నీరు నిల్వ ఉంది. కుడి గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30.648 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2.026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ వాటర్ రెగ్యులేటరీ ద్వారా 24.500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలలో కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 177.022ల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా..16 గేట్ల ద్వారా 179.163ల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టిఎంసిలుకాగా ప్రస్తుతం 9.34 టిఎంసిల నీటి నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ జలాశయానికి 68.178 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఔట్ ఫ్లో 51.631 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 312.05 టిఎంసిలుకాగా ప్రస్తుతం 305.80 టిఎంసిల నీటి నిల్వ ఉంది.
పులిచింతల ప్రాజెక్టుకు 31.243 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా దిగువకు 47.959 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టిఎంసిలు కాగా ప్రస్తుతం 44.79 క్యూసెక్కులుగా ఉంది.
ప్రకాశం బ్యారేజికి 37.515 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా 34.088 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.07 టిఎంసిలు నమోదు అయి ఉంది.