ముంబై: అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖుల మైనపు విగ్రహాలను రూపొందించి, వాటికి సజీవ రూపం ఇచ్చే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. దీన్ని రేపు సింగపూర్‌లోని మ్యూజియంలో ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గానూ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ మేరకు టుస్సాడ్స్ సంస్థ తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
One more day to the official launch of Sridevi's first and only unique wax figure in Madame Tussauds Singapore! Don’t forget to tune in to our Facebook and Instagram at SGT 10AM for our LIVE streaming! #Sridevi #MTSGSridevi #MrIndia #MTSG #MadameTussaudsSG pic.twitter.com/mHjAyWgDhh
— Madame Tussauds Singapore (@MTsSingapore) September 3, 2019
ఈ సందర్భంగా శ్రీదేవి బోని కపూర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘శ్రీదేవి మా గుండెలోనే కాదు.. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సెప్టెంబరు 4న సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఆమె మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.
Sridevi lives forever in not just our hearts but also in the hearts of millions of her fans. Eagerly waiting to watch the unveiling of her figure at Madam Tussauds, Singapore on September 4, 2019. #SrideviLivesForever pic.twitter.com/AxxHUgYnzt
— Boney Kapoor (@BoneyKapoor) September 3, 2019
గతంలో బాలీవుడ్ నుంచి అమితాబ్, హృతిక్, ఐశ్వర్య, షారుక్, మాధురి దీక్షిత్ ఇలా చాలా మంది మైనపు విగ్రహాలను మేడమ్ టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసారు. ఇటీవలే టాలీవుడ్ నుంచి మహేష్, ప్రభాస్ మైనపు బొమ్మలను కూడా ఏర్పాటు చేశారు. కాగా, బోనికపూర్ సోదరి రీనా కుమారుడు మోహిత్ మార్వా పెళ్ళికని దుబాయ్ వెళ్లిన శ్రీదేవి ఫిబ్రవరి 24,2018న బాత్ టబ్‌లో మునిగి కన్ను మూసిన సంగతి తెలిసిందే.