(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. కానీ, రహదారిపై ఓ ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. తనతో పెట్టుకుంటే ఎంత పెద్ద జంతువైనా సరే తోక ముడవాల్సిందే అన్నట్టు గుణపాఠం చెప్పింది. వివరాల్లోకి వెళితే.. రాత్రి సమయంలో రోడ్డుపై వెళుతున్న చిరుత, ముళ్ల పంది ఎదురుపడ్డాయి. ముళ్ల పందిని చంపి తినేందుకు చిరుత పులి యత్నించింది. అయితే, పందిని కొరకడానికి ప్రయత్నించిన చిరుత నోటికి దాని ముళ్లు గుచ్చుకోవడంతో నొప్పితో విలవిలలాడింది. ఆ ముల్లును తొలగించుకోవటానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా తన ముందు కాలుతో ఆ ముల్లును తీసేసి.. అక్కడ్నుంచి తన దారిన తాను వెళ్లిపోయింది.
https://twitter.com/ParveenKaswan/status/1197117490452545536
చిరుత, ముళ్ల పంది మధ్య జరిగిన పోరాటం వీడియోను ఇండియన్ ఫారెస్టు అధికారి పర్విన్ కశ్వాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘ముళ్లపందికి, చిరుతకు మధ్య భీకర పోరాటం.. చివరకు చిరుత గుణపాఠాన్ని నేర్చుకుంది’ అని పోస్టు పెట్టాడు. దీంతో ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వచ్చాయి. 58 సెకన్ల వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చిరుతకు ఆ ముళ్లపంది తగిన గుణపాఠం చెప్పిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
I think every animal small in size or big have got 1 special ability or feature to protect itself.
— Ojas (@ojasy11) November 20, 2019
hope the leopard is not harmed by the quills.
— sudeshna (@sudeshna2104) November 20, 2019