Subscribe for notification

రైలు చుట్టూ నీరు, 700 మంది ప్రయాణికుల తరలింపు!

Share

 

ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రయాణీకుల రైలు పట్టాలపై నిలిచిపోయింది. దాదాపు 700 మంది ప్రయాణికులు శుక్రవారం రాత్రి నుండీ అందులో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు రాష్ట్రప్రభుత్వం రెండు మిలటరీ హెలీకాప్టర్లను పంపించింది. జాతీయ విపత్తు సహాయక దళం బృందాలు ఆరు బోట్లలో తరలివెళ్లారు. చివరికి మొత్తం అందరినీ రక్షించి బయటకు తెచ్చారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబై, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో జనజీవనం స్థంభించిపోయింది. నాలుగు వైపులా నీరు అయిదారు అడుగుల ఎత్తున కమ్ముకోవడంతో  ముంబై – కొల్హాపూర్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ ధానే జిల్లాలోని వంగేని సమీపంలో పట్టాలపై నిలిచిపోయింది. ప్రయాణికులు సహాయం అర్ధిస్తూ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి పంపడంతో వారి సంగతి తెలిసింది.

బయట ప్రమాదకరమైన రీతిలో నీటిమట్టం ఉన్నందున రైలు దిగవద్దని అధికారులు ప్రయాణికులను హెచ్చరించారు. ఇప్పటికే 500 మందికి పైగా ప్రయాణికులను కాపాడామని అధికారులు చెప్పినట్లు ఎన్‌డి టివి తెలిపింది.

ధానే ప్రాంతంలోని బద్లాపూర్, ఉల్హాస్‌నగర్, వంగేని పట్టణాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రాత్రంతా కురిసిన వానతో ముంబై నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సీజన్‌లో ముంబై నగరం జలదిగ్బంధంలో చిక్కుకోవడం ఇది రెండవసారి.

Video, Photo Courtesy: ANI

Video Courtesy: ABP News


Share
Siva Prasad

Recent Posts

Acharya: సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి “ఆచార్య” పై వైరల్ కామెంట్స్..!!

Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…

10 mins ago

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…

20 mins ago

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

56 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago