టాప్ స్టోరీస్

మొయిత్రాపై అభాండం.. జీన్యూస్ నిర్వాకం!

Share

జిన్యూస్‌లో ఛానల్‌లో డైలీ న్యూస్ అండ్ ఎనాలిసిసిస్ (డిఎన్ఎ) అనే కార్యక్రమం ఉంది. ఆ ప్రోగ్రాం నడిపే సుధీర్ చౌదర్ తన కార్యక్రమం కోసం చాలా రీసెర్చ్ చేస్తానని చెప్పుకుంటాడు. అలాంటి రీసెర్చ్ ఫలితంగా ఆయన జూలై మూడవ తేదీన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా ‘బండారం’ ఒకటి బయటపెట్టారు.

మొదటిసారి ఎంపీగా ఎన్నికయిన తృణమూల్ సభ్యురాలు మహువా మొయిత్రీ జూన్ 25వ తేదీన లోక్‌సభలో చేసిన ప్రసంగం దేశం దృష్టిని ఆకర్షించింది. మొదటి సారి ఎంపీగా గెలిచి ప్రప్రధమంగా లోక్‌సభలో ప్రసంగిస్తూ ఆమె కనబరిచిన ప్రతిభ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమయింది.

మొయిత్రాకు అంత పేరు తెచ్చిన ప్రసంగం ఒరిజనల్‌గా ఆమెది కాదు, ఆమె దొంగతనంగా కాపీ కొట్టింది అంటారు సుధీర్ చౌదరి. తాను బోలెడు పరిశోధన చేసి ఈ విషయం కనుగొన్నానని ఆయన మూడవ తేదీన తన డిఎన్‌ఎ ప్రోగ్రాంలో పేర్కొన్నారు.

భారతదేశంలో ఫాసిస్టు పాలన వస్తుందనేదానికి ఏడు సంకేతాలు కనబడుతున్నాయని మొయిత్రా తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2017లో అచ్చయిన ఒక వ్యాసం నుంచి మొయిత్రా దీనిని కాపీ కొట్టిందని సుధీర్ చౌదరి పేర్కొన్నారు. ట్రంప్ పాలన ఫాసిజానికి దారి తీస్తుందని చెప్పే 12 సంకేతాలు అంటూ అందులో రాశారనీ, మొయిత్రా దానిని కాపీ కొట్టారనీ ఆయన అన్నారు. ఆ వ్యాసం పేజీలను కూడా చౌదరి ట్వీట్ చేశారు.

మొయిత్రా ప్రసంగాన్ని చౌదరి హేయమైనదిగా అభివర్ణించారు. ఇలాంటి దొంగ ప్రసంగాల వల్ల పార్లమెంట్ ప్రతిష్ట ప్రమాదంలో పడుతుందని ఆయన తాను చెబుతున్న వ్యాసం కాపీని కెమేరా ముందు ఊపుతూ వ్యాఖ్యానించారు.

నిజం ఏమిటి? మొయిత్రా నిజంగానే కాపీ కొట్టారా? చౌదరి చూపించిన కాగితాల్లో ఆ వ్యాసకర్త పేరు కనబడుతుంది. మార్టిన్ లాంగ్‌మ్యాన్ అనే వ్యక్తి రాసిన ఆ వ్యాసాన్ని వాషింగ్టన్ మంత్లీ ప్రచురించింది. అమెరికాలోని హోలోకాస్ట్ (రెండవ ప్రపంచ యుద్దం సమయంలో జరిగన యూదు నిర్మూలనను హోలోకాస్ట్‌గా అభివర్ణిస్తారు) మ్యూజియంలో వేలాడదీసిన ఒక పోస్టర్‌పై ఈ ఫాసిజం సంకేతాలు రాసి ఉన్నాయని లాంగ్‌మ్యాన్ తన వ్యాసంలో రాశారు.

ఇక మళ్లీ మొయిత్రా ప్రసంగం దగ్గరకు వద్దాం. ఆమె ప్రసంగాన్ని జాగ్రత్తగా వింటే ఫాసిజం సంకేతాలకు సంబంధించి తాను చెప్పిన మాటలకు తనకు ప్రేరణ ఎక్కడ కలిగిందో మొయిత్రా స్వయంగా చెప్పినట్లు మనకు అర్ధమయిపోతుంది. సుధీర్ చౌదరి తన ప్రోగ్రాంలో చెప్పింది వాస్తవం కాదు. మొయిత్రా ప్రసంగం టైమ్‌లైన్‌లో 9 నిముషాల 12 సెకన్ల దగ్గర వినండి. 2017లో హోలోకాస్ట్ మ్యూజియంలో ఒక పోస్టర్ పెట్టారు. అందులో ఫాసిజం వస్తుందనడానికి సూచనలు రాశారు. నేను ఇప్పుడు చెప్పిన ఏడు సంకేతాలు అందులో ఉన్నాయి అని ఆమె స్పష్టంగా పేర్కొన్నారు.

జీన్యూస్ వివాదం రగిల్చిన తర్వాత లాంగ్‌మ్యాన్ కూడా స్పందించారు. మొయిత్రాపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారని ఆయన  పేర్కొన్నారు.

మొయిత్రా కూడా దీనిపై పత్రికా ప్రకటన ద్వారా స్పందించారు.  సర్ లారెన్స్ డబ్ల్యు బ్రిట్ రూపొందించిన పోస్టర్‌లోని సంకేతాలలో ఇండియాలో పరిస్థితులకు తగిన విధంగా ఉన్న ఏడు సంకేతాలను తాను లోక్‌సభలో ఏకరువు పెట్టానని ఆమె చెప్పారు. తనకు స్ఫూర్తి ఎక్కడ నుంచి వచ్చిందో ప్రసంగంలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఎక్కడనుంచి అన్నది దాచితే కాపీ అవుతుంది కానీ వెల్లడించితే కాదని మొయిత్రా అన్నారు.

సుధీర్ చౌదరి జిన్యూస్‌లో ఈ ప్రోగ్రాం చేయకముందే శోభా డే, మకరంద్ పరంజెపె, కంచన్ గుప్తా వంటి ప్రముఖులు మొయిత్రా ప్రసంగం దొంగతనంగా అరువు తెచ్చుకున్నదని ఆరోపించారు.

మహువా మొయిత్రా వేరే సాహిత్యం నుంచి స్ఫూర్తి పొంది ఆ విషయాన్ని దాచకుండానే చేసిన ప్రసంగాన్ని జిన్యూస్ దొంగతనంగా అరువు తెచ్చుకున్నదిగా తప్పుడు రిపోర్టు చేసింది. వాస్తవం బయటకు వచ్చిన తర్వాత దానిని సుధీర్ చౌదరి దృష్టికి తీసుకువెళ్లినపుడు అతను తప్పు దిద్దుకునేందుకు ప్రయత్నించలేదు. పైగా ముక్కల ముక్కల గ్యాంగ్‌ను చితగ్గొట్టిన తర్వాత కూడా కేకలు వేస్తున్నారు అంటూ ట్వీట్ చేశాడు.

-ఆల్ట్ న్యూస్  వెబ్‌సైట్ సౌజన్యంతో


Share

Related posts

పంచాయితీరాజ్ పనులు నిలిపివేత!

Siva Prasad

42వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

somaraju sharma

తమిళనాడులో మోదికి నిరసన సెగ

somaraju sharma

Leave a Comment

Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar