లండన్: పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటిష్ పార్లమెంటు సభ్యురాలు నాజ్ షా చాలా దారుణమైన అనుభవం ఎదుర్కొన్నారు. ఆమె లండన్ నగరంలో ఓ బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆమె ఎదురుగా కూర్చున్న ఓ వ్యక్తి హస్తప్రయోగం చేశాడు. ఆమె సెంట్రల్ లండన్ లోని వైట్ హాల్ వద్దకు చేరుకోగానే పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదుచేశారు. నాజ్ షా ప్రస్తుతం లేబర్ పార్టీ తరఫున బ్రాడ్ ఫోర్డ్ వెస్ట్ ప్రాంతానికి నాయకత్వం వహిస్తున్నారు.
‘‘ఈ విషయం గురించి నేను షాక్ లో మునిగిపోయాను, చాలా ఇబ్బందికరంగా ఫీలవుతున్నాను. అతడు అక్కడ చాలా మామూలుగా కూర్చున్నాడు. దాంతో ఏం చేయాలో నాకే అర్థం కాలేదు. ఇప్పటికీ అతడి లైంగిక ప్రవర్తన గురించి ఫిర్యాదుచేసినా ఇంకా చాలా ఇబ్బందిగానే ఉంది’’ అని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి అనుభవం తనకెప్పుడూ లేదని, మహిళలు ఇలాంటివి ఎదుర్కోకుండా తమ పనేదో తాము చూసుకునేలా అనుమతించాలని కోరారు.
Still feeling sick after reporting indecent sexual behaviour to @metpoliceuk on @TfL bus earlier! Apparently over 90% goes unreported. Always report it to ensure it is stamped out. Text What, Where and When to 61016 or call 101 https://t.co/PMgZKJrsQC #StaySafe #SeeItReportIt
— Naz Shah MP ? (@NazShahBfd) April 2, 2019
ఆ తర్వాత నాజ్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా షేర్ చేశారు. ఇలాంటి లైంగిక దుష్ప్రవర్తనల గురించి 90 శాతం మంది అసలు ఫిర్యాదు చేయరని తనకు తెలిసిందని ఆమె యూట్యూబ్ వీడియోద్వారాను, ట్విట్టర్ ద్వారాను చెప్పారు. ఇలాంటి ఘటనల గురించి ఫిర్యాదుచేయకపోతే, అవి ఎన్ని జరిగాయో కూడా లెక్క ఉండదన్నారు. ఫోన్ చేయాల్సిన, లేదా మెసేజ్ చేయాల్సిన నంబర్లను కూడా ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను బస్సు దిగి వెళ్లిపోయే సమయానికి అతడు తన అంగాన్ని బయటకు తీసి హస్తప్రయోగం చేశాడని కూడా ఆమె చెప్పారు. దీనిపై లండన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.