(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించడం సర్వసాధారణం. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రవాణ చట్టం ప్రకారం భారీ ఫైన్ లు వేస్తున్నారు. ఇటీవల హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వేస్తే… సొంత బండిని తగలబెట్టేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ యువకుడు ట్రాఫిక్ పోలీసుల ముందే బైకును కిందపడేసి.. అటూ ఇటూ దొర్లించాడు. దాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి అదే బైకు మీద కూర్చొని ఏడ్వడం మొదలుపెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. మీరట్ లో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తున్న ఓ యువకుడికి పోలీసులు వెయ్యి రూపాయల ఫైన్ వేశారు. ఫైన్ కట్టి వెళ్లమంటూ చలాన్ చేతిలో పెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ యువకుడు బైకును కిందపడేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. బైక్ ను కిందపడేసి తొక్కేశాడు. ‘నాకొద్దీ బైక్… నాకు సంబంధం లేదు” అంటూ… దాన్ని అటూ ఇటూ పడేశాడు. తర్వాత అదే బైక్‌పై అడ్డంగా కూర్చొని చిన్నపిల్లవాడిలా ఏడ్చేశాడు. దీంతో ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు.
Agitated over traffic challan, a biker in UP's Meerut took out his anger on his motorcycle. He later sat on the fallen bike and started crying as traffic cops stood and watched the entire drama unfolding on a busy street in the city. @Uppolice pic.twitter.com/lZ8TfQYUWt
— Piyush Rai (@Benarasiyaa) November 25, 2019
నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది ఆ కుర్రాడిని చూసి జాలిపడ్డారు. హెల్మెట్ పెట్టుకొని ఉంటే… ఇలా సొంత బైక్‌ని పాడుచేసుకునే పరిస్థితి వచ్చేది కాదు అని కామెంట్లు చేస్తున్నారు. హెల్మెట్ పెట్టుకుంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు అంటున్నారు. కొత్త ట్రాఫిక్ చలానాలు చెల్లించడం వాహనదారులకు భారంగా మారిందని, అందుకే, ఆ యువకుడు తన ఫ్రస్ట్రేషన్‌ను ఇలా చూపించాడని మరికొందరు అన్నారు.
Very unfortunate. Maybe the fine is beyond his means. Though traffic discipline is necessary, insanely high fines serve no purpose.
— Bajirao82 (@Sangfroid7A) November 25, 2019
Stupidily increasing the fine was one of the thoughtless decisions made by this govt. No one in their right mind would suggest such a culpable law neglecting common man's situation.
— Prithvi Raj (@PrithviRajdj) November 25, 2019
https://twitter.com/ilyassism/status/1198903805636530176