ప్రశాంతంగా రాజధాని మహిళల ఇంద్రకీలాద్రి పాదయాత్ర

Share

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: పోలీసుల నిషేదాజ్ఞలు, నిర్భందాలు లేకుండా రాజధాని ప్రాంత మహిళల బెజవాడ దుర్గమ్మ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమం ఆదివారం ప్రశాంతంగా జరిగింది.

మందడం గ్రామం నుండి విజయవాడ దుర్గగుడికి రాజధాని ప్రాంత గ్రామాల మహిళలు మొక్కుబడులు చెల్లించుకునేందుకు కలశాలతో ర్యాలీగా వెళ్లి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో దుర్గమ్మకు మొక్కుబడులు చెల్లించుకోవడం మందడం మహిళల సంప్రదాయం.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్‌తో రాజధాని గ్రామాల్లో ఆందోళనలు జరుగుతున్న కారణంగా ఈ నెల 10వ తేదీన రాజధాని గ్రామాల నుండి దుర్గమ్మకు మొక్కుబడులు చెల్లించుకునేందుకు బయలుదేరిన మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. పలువురు మహిళలను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ కొందరు మహిళలు దుర్గగుడి వరకూ వెళ్లి మొక్కుబడులు చెల్లించుకున్నారు.

ఆనాడు పోలీసులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టులో రాజధాని రైతులు పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసుల చర్యలను హైకోర్టు తప్పుబట్టింది. తీవ్రంగా మందలించింది.

ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శిరస్సుపై కలశాలను పెట్టుకుని ఊరేగింపుగా దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు.

వీరి ప్రదర్శనను అడ్డుకునేందుకు పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీంతో మహిళలు ప్రశాంతంగా అమ్మవారికి పొంగళ్ల సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. పోలీసులు ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా ఉండటంతో రైతులు, మహిళా హర్షం వ్యక్తం చేశారు. రాజధాని అమారావతిలోనే కొనసాగించాలని అమ్మావారిని వేడుకున్నట్లు మహిళలు తెలిపారు.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

10 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago