(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కొచ్చి: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మరడు ప్రాంతంలోని అక్రమ కట్టడాలలో ఒకదానిని కూల్చివేశారు. కొచ్చి నగరాన్ని ఆనుకుని ఉన్న మరడులో కట్టిన ఆకాశ హర్మ్యాలు అన్నీ నిబంధనలకు విరుద్ధమైనవేనని తేల్చిన సుప్రీంకోర్టు గత సంవత్సరం వాటి కూల్చివేతకు ఆదేశించింది.
#WATCH Maradu flats demolition: H2O Holy Faith apartment tower demolished through controlled implosion #Kerala pic.twitter.com/fKbciLGH14
— ANI (@ANI) January 11, 2020
భవనం లోపలలోపలే కుప్పకూలేలా అమర్చిన పేలుడు పదార్ధాలను అంటించగానే భవనం సెకన్లలో నేలమట్టమయింది. మొదట హోలీఫెయిత్ అపార్ట్మెంట్ కూల్చివేశారు. అల్ఫా సెరేన్, తర్వాత కూలుస్తారు. నాలుగింటిలో పెద్దదయిన జైన్ కోరల్ కోవ్ను ఆదివారం కూలుస్తారు. గోల్జెన్ కొయిలోరమ్ కూడా ఆదివారమే కూలుతుంది.
కూల్చివేత సందర్భంగా అక్కడ భూమి, గాలి నీటిపై సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి కూల్చివేతను చూశారు.