మోది, అమిత్ షాతో ‘సైరా’ భేటీ!

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాలను మెగా స్టార్ చిరంజీవి నేడు కలవనున్నారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌తో కలిసి చిరంజీవి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ‘సైరా’ బంపర్ హిట్ నేపథ్యంలో ‘చిరు’ పలువురు ప్రముఖులను కలిసి తన సినిమాను వీక్షించడానికి ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై కలిసి ఆహ్వానించగా ఆమె వీక్షించి అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. రెండు రోజుల క్రితం ఏపి సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని చిరంజీవి సతీసమేతంగా కలిసి వారి ఆతిధ్యాన్ని స్వీకరించారు. తాజాగా నేడు ప్రధాని మోది, హోంమంత్రి అమిత్‌షాలను చిరు కలవనున్నారు.అనంతరం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కలిసి ‘సైరా’ను వీక్షించనున్నారు.