(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదన్న ఆగ్రహంతో దక్షిణ మెక్సికో పౌరులు చట్టాన్ని తమ చేతుల్లోకి అమానుషంగా ప్రవర్తించారు. చిపాస్ రాష్ట్రంలోని మేయర్‌ను కిడ్నాప్ చేసి, ఒక ట్రక్కుకు కట్టి, వీధుల గుండా లాక్కెళ్లారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. లాస్ మార్గరీటాస్ పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#Enterate Circula en redes video en el que pobladores del ejido Santa Rita en el municipio de #LasMargaritas, #Chiapas, suben en una camioneta al alcalde Jorge Luis Escandón Hernández. Los motivos es porque no ha cumplido lo prometido en campaña. pic.twitter.com/Yywx2exGAC
— Tabasco Al Minuto (@Tabalminutomx) October 8, 2019
గతుకుల రోడ్లతో ప్రమాదాలకు గురవ్వుతున్న ప్రజలు విసిగిపోయారు. దీంతో కొంత మంది మేయర్ కార్యాలయంలోకి చొరబడి మేయర్ జార్జ్ లూయిస్ ఎస్కాండన్ హెర్నాండెజ్ను బయటకు లాక్కొచ్చారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రోడ్లు బాగు చేయడం లేదనే కోపంతో ప్రజలు నేరుగా మేయర్‌నే నిలదీశారు. అయితే రోడ్ల సమస్యపై మేయర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో అతన్ని బలవంతంగా బయటకు లాక్కొని వచ్చి ట్రక్కుకు కట్టేశారు. అనంతరం నగర వీధుల్లో ఈడ్చుకెళ్తూ.. రోడ్ల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సందర్భంగా మేయర్ మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరినొకరు కర్రలు, పైపులతో కొట్టుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే వచ్చి వారి నుంచి మేయర్‌ను విడిపించారు.
#ÚLTIMAHORA
Habitantes de la comunidad Santa Rita Invernadero amarran y arrastran con una camioneta al alcalde de Las Margaritas, Chiapas, Jorge Luis Escandón, a quien exigen proyectos productivos y rehabilitación de un camino. pic.twitter.com/Kzw9ZmfwFU— PortavozChiapas (@PortavozChiapas) October 8, 2019
దీనికి ఘటనకు సంబంధించి 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై హత్యాయత్నం, అపహరణ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మేయర్ అనుచరులు కూడా నిరసనకారులపై దాడి చేయడంతో 10 మందికి గాయాలు అయ్యాయి. కాగా మేయర్ పై ఇలా దాడి చేయడం ఇది రెండోసారి అని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నోసార్లు తమ సమస్యలు మేయర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదని అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని నిరసనకారులు అంటున్నారు. ఇదిఇలా ఉంటే.. ఇదే మెక్సికో రాష్ట్రంలో కొద్ది నెలల కిందట ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పాడని ఎంపీలకు మహిళల దుస్తులు వేసి ఊరేగించారు.
#enPunto, esta noche
Pobladores se llevan por la fuerza al alcalde de Las Margaritas, Chiapas, y lo arrastran amarrado a una camioneta por las calles. Argumentan que fue por incumplir promesas de campaña.
La crónica, a las 22:30 horas pic.twitter.com/Xx6ETXHvAC
— Denise Maerker (@DeniseMaerker) October 9, 2019